17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

షీలా దీక్షిత్ : జీవితం - రాజకీయ అరంగేట్రం

పంజాబ్ లోని కపుర్తల జిల్లాలో జన్మించిన దీక్షిత్ ది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమేమీ కాదు. నాన్నది ఢిల్లీ. అమ్మది పంజబ్. తండ్రి రక్షణదళ అధికారి. ముగ్గురక్కచెల్లెళ్ళలో షీలా దీక్షితే పెద్ద. హైస్కూలు చదువు ఢిల్లీ జీసెస్ అండ్ మేరీ స్కూల్లో; మిరిండా హౌస్ లో డిగ్రీ పూర్తిచేశారు. 1950 లో ఢిల్లీ యూనివర్శిటీలో పీజీ చేస్తుండగా వినోద్ శర్మతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది. షీలాదీక్షిత్ ది బ్రాహ్మణ కుటుంబం కాదు. ఆమె మామగారిది మాత్రం సంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబం. ఐఏఎస్ అధికారిగా ఎంపికైన వినోద్ తో షిలా జీవితం సాఫీగా సాగిపోయింది. వారి కలల్ పంటలు బాబు(సందీప్), పాప(లతిక). వీరిలో సందీప్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. వినోద్ తండ్రి ఉమాశంకర్ దీక్షిత్ నెహ్రూ కుటుంబానికి అత్యంత ఆప్తులు. ఆయన కాంగ్రెస్ పార్టీ కోశాధికరిగా, కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. ఇందిరా, రాజీవ్ లతో కూడా ఆయనకు సాన్నిహిత్యం ఉంది. 1984లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రోత్సాహం మేరకు ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాథించారు. తరువాత లోక్ సభ అంచనాల కమిటీలో సభ్యురాలయ్యారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా ప్రధాని కార్యలయ మంత్రిత్వశాఖలో సహాయమంత్రిగా పనిచేసి తన సమర్థతను రుజువు చేసుకున్నారు. 1989లో ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు.

1986లో ఓరోజు వినోద్ శర్మ కాన్పూర్ నుంచి న్యూఢిల్లీకి రైల్లో ప్రయాణిస్తుండగా గుండెనిప్పితో మృతిచెందారు. ఆ సమయంలో షీలాదీక్షిత్ ఐక్యరాజ్యసమితి పని మీద న్యూయార్క్ లో ఉన్నారు. వినోద్ లేని జీవితం ఊహించడానికి భయమేసినప్పటికి గుండెను రాయిగా చేసుకుని జీవితాన్ని సాగించారు. మామయ్య ఉమాశంకర్ దీక్షిత్ , రాజీవ్ గంధీ మద్దతుతోమాములు జీవితంలోకి వచ్చింది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved