17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

జ్వాలముఖి ఆరిపోయింది

By కె, మణినాథ్

ప్రముఖ విప్లవకవి, దిగంబర కవి ప్రజా సాహితీ ఉద్యమ నాయకుడు జ్వాలాముఖి ఆదివారం(14/12/2008)నాడు దివంగతులయ్యారు. ఆయన ఏడాది కాలం కాలేయం వ్యాధితో బాధపడ్డారు. గుండె నొప్పితో బాధ పడే వీరికి 1991లో గుండె ఆపరేషను జరిగింది. వీరికి భార్య, 3 కుమారులు వున్నారు.

జీవితం

1938లో మెదక్ జిల్లా ఆకారం గ్రామంలో నరసింహాచార్యులు, వెంకట లక్ష్మీనరసమ్మలకు జన్మించిన జ్వాలాముఖి అసలు పేరు వీరవల్లి రాఘవాచారి . నిజాం కాలేజీలో చదివిన (యల్.యల్.బి ) వీరు ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. సికింద్రాబాద్, బెంగుళూరు సైనిక పాఠశాలల్లో 12 సంవత్సరాలు పని చేశారు. హైదరాబాదులో 24సంవత్సరాలు ఉపాధ్యాయవృత్తిలో కొనసాగారు. నలభై వత్సరాలుగా ప్రజా ఉద్యమాలలో మమేకమైన ప్రజా సాహితీ ఉద్యమ నాయకులు వీరు. గ్రామీణ పేదల, కార్మికుల, మేధావి ఉపాధ్యాయ విద్యార్ధి ఉద్యమాలలో కలిసి పోయి, విప్లవ స్ఫూర్తి నిచ్చేవక్తగా జ్వాలా ముఖి అందరికీ సుపరిచితులు. రాష్ట వామ రక్ష ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు భారత-చై నా మిత్ర మండలి రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కమిటీ ఉపాధ్యక్షునిగా రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను పటిష్టమయ్యేందుకు కృషి చేశారు. రెండు సార్లు చైనా పర్యటన కూడా చేశారు.

కవిగా

వీరు మంచి కవి, రచయిత.మనిషి (1958) దీర్ఘకవితకి కరుణశ్రీ చేతుల మీదుగా ఉత్తమ రచయిత పురస్కారాన్ని అందుకున్నారు. నాస్తికవాది, మానవతావాది అయిన జ్వాలాముఖిని మార్కిస్టు విధానాలు ఆకర్షించాయి. వీరు రచించిన కవితలు ఆవేశపూరితమై విప్లవకారులకు స్ఫూర్తి నిచేవి. దోపిడివిధానం,పీడనలపై అణచివేతలపై తనకలంతో ఉద్యమాలు చేసేవారు. పీడిత ప్రజలకు, కార్మిక-శ్రామికులకు స్ఫూర్తినిచ్చే విధంగా దోపిడీ పాలనను ధిక్కరించిన ధీశాలి. తను నమ్మిన సిద్ధాంతాలని ఆచరించిన గొప్ప వ్యక్తి. తన రచనలతో, ఉద్యమాలతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ప్రభుత్వం జ్వాలాముఖితో పాటు మరికొంతమంది విప్లవ రచయితలపై కేసులు నమోదు చేసి జైల్లో నిర్భంధించింది. 50 రోజుల పాటు జైలు శిక్షననుభవించిన వీరు తిరిగి ఎమర్జన్సీ కాలంలో కూడా 15 రోజులు జైల్లో వున్నారు. విరసం వారి కవితా సంకలనాలను అనాటి ప్రభుత్వం నిషేధించింది.

జ్వాలాముఖి దిగంబర కవిలలో ఒకరు. 1965-70 మధ్య "దిగంబర కవులు" పేరుతో కవితా సంపుటాలు రచించారు. తెలుగులో విప్లవ కారులకు స్ఫూర్తినిచ్చే సాహితీ ఉద్యమం 1970 జులై 4న అర్ధరాత్రి సమయాన "విప్లవ రచయితల సంఘం" -వి.ర.సం. ఏర్పడింది. ఈ సంఘం ఏర్పాటులో జ్వాలాముఖి ప్రధాన ప్రాత వహించారు. విరసం సంస్ధకు రాజీనామా చేశాక "నవసాహితీ" సంస్ధను ఏర్పాటు చేశారు. కొంత కాలం తరువాత అక్కడినుంచీ బయటికి వచ్చి విప్లవాభిమానంతో సమాజాభివృద్ధికై "ప్రజా ఉద్యమాల"కు బాసటగా నిలిచారు.

జ్వాలాముఖిఓటమి - తిరుగుబాటు కవితా సంకలనానికి వైరుధ్యాల మధ్య-నేను-నా కవితావేశం అని రాసుకున్న ఉత్తర పీఠికలో సాహిత్యం-రాజకీయాలు ఎలా బింబ-ప్రతిబింబాలో వివరించారు. కేవలం మానవతావాదం నుండి తన కవిత్వం తిరుగుబాటుకు, మార్క్సీయ వర్గపోరాట దృక్పధానికి పరిణామం చెందిన తీరును పరిచయం చేసుకున్నారు. "ఈ దేశంలో ప్రజల సాహసానికి, త్యాగానికి, బుద్ధికి ఎన్నడూ ఎన్నడూ లోపం లేదు" అని అనేవారు.

రచనలు - అవార్డులు

1979లో ఉరిశిక్షకు వ్యతిరేకంగా రాసిన నవలవేలాడే మందారం జ్యోతి మాస పత్రికలో వచ్చింది. హిందీలో వేమూరి ఆంజనేయశర్మ అవార్డుని అందుకున్నారు. హైదురా"బాధ " లు అనే కధలు మయూరి పత్రికలో ధారావాహింకంగా వచ్చాయి.రాంగేయ రాఘవ జీవిత చరిత్రను హిందీనుంచి తెలుగు అనువాదం చేశారు.ఓటమి తిరుగుబాటు వారి కవితా సంకలనం.మనిషి కవితకి ఉత్తమ రచయిత అవార్డు (1958) లభించింది. ఝాన్సీ హేతువాద మెమోరియల్ అవార్డు, దాశరధీ రంగాచార్య పురస్కారం ఇంకా ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్న వీరు భౌతిక కాయం వీడినాప్రజాకవి గా అందరి మదిలో నిలిచే వుంటారు.

ఇంకా

దిగంబర కవిగా జ్వాలాముఖి


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved