17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

శివరాజ్ పాటిల్‌ గురించి

ముంబయిపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో హోంమంత్రి పదవి నుంచి వైదొలగిన శివరాజ్ పాటిల్ శైలి విభిన్నం. స్వతహాగా సున్నిత మనస్కుడైన పాటిల్ గాంధీ-నెహ్రూ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా గుర్తింపుపొందారు. ఫలితంగా అనతికాలంలోనే అనేక పదవులు చేపట్టే అవకాశం లభించింది. రాజకీయంగా అంచలంచెలుగా ఎదిగారు.

అంచంలంచెలుగా పదవులు...

1935 అక్టోబర్ 12న మహారాష్ట్రలోని లాతూరు జిల్లా చాకూర్ గ్రామంలో జన్మించిన పాటిల్ హైదరబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీయస్సీ, ముంబాయి విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1963 జూన్13న విజయ పాటిల్ తో ఆయన వివాహం జరిగింది. ఒక కుమారుడు, ఒక కుమార్తె. 1967-69, 1971-72 మధ్య కాలంలో లాతూరు మునిసిపాలిటీ చైర్మన్ గా పనిచేసిన ఆయన మహారాష్ట్ర శాసనసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. న్యాయశాఖ ఉప మంత్రిగా, శాసనసభ డిప్యూటీ స్పీకర్, స్పీకర్ గా పని చేశారు. 1980లో తొలిసారిగా ఏడో లోక్ సభకు ఎన్నికైన పాటిల్ వరుసగా ఏడుసార్లు పార్లమేంట్ సభ్యునిగా ఎన్నికవడం విశేషం. 2004 ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలయ్యారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మంత్రివర్గాల్లో పనిచేసి వారికి నమ్మినబంటుగా ఉన్నారు. పీవీ హయాంలో 1991 నుంచి 96 వరకు లోస్‌సభ స్పీకర్ గా పని చేశారు. ఎన్డీఏ హయాంలో 13 వ లోస్ సభలో ప్రతిపక్ష ఉపనాయకునిగా వ్యవహరించారు. సోనియాగాంధీ హయాంలో కూడా పాటిల్‌కు అపరమిత ప్రాధాన్యత లభించింది. 1999 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక కమిటీ చైర్మన్ గా పనిచేశారు.

అయిష్టంగానే అరంగేట్రం

అసలు రాజకీయాలంటేనే ఆదిలో విముఖత కనబరిచేవారు. 70వ దశకంలో నాటి కాంగ్రెస్ నాయకత్వం ఆయనను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు అప్పటి యంగ్ టర్క్ ల్లో ఒకరైన మోహన్ ధారియాను వినియోగించింది. శక్తిమంతమైన మరఠా నేతల రాజకీయాల్లో లింగాయత్ కులానికి చెందిన తాను ఇమడలేనని తన స్వభావం రాజకీయాలకు సరిపోదని ఆనాడే శివరాజ్ పాటిల్ స్పష్టం చేశారు. అయినప్పటికి తాము ప్రోత్సహించి రాజకీయ అరంగేట్రం చేయించామని ధారియా వెల్లడించారు. తన గురించి ఆయన వేసుకున్న అంచనాలు వాస్తవమే. హోంశాఖ కాకుండా విదేశాంగ, ఆర్థిక రక్షణ శాఖలు అప్పగిస్తే ఆయన మంత్రిగా మరి కొంతకాలం ఉండేవారేమో?


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved