19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

మాల్దీవుల నూతనాధ్యక్షుడు నషీద్

ప్రజాస్వామ్య ముసుగు ధరించిన నియంతలు ఎల్లకాలం ప్రజలను నమ్మించలేరన్నది నిర్దిష్టమైన చారిత్రక సత్యం. ఎన్నోమార్లు ఈ విషయం సందేహాలకు అతీతంగా రుజువైంది. మొన్న జరిగిన మాల్దీవుల ఎన్నికల్లో మరోసారి స్పష్టమైంది. దక్షిణాసియాలోని చిన్నదేశమైన మాల్దీవులను మూడు దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యంగా ఏలిన మమెన్ అబ్దుల్ గయూమ్‌కు ప్రజలు ఈసారి గట్టి గుణపాఠమే నేర్పారు. ఒకప్పటి రాజకీయ ఖైదీ అయిన నలభై ఒక్కేళ్ల మహమ్మద్ "అన్నీ" నషీద్ గయూమ్ ను గద్దెదించి చరిత్ర సృష్టించారు. తొలుత అక్టోబరు 9న జరిగిన ఎన్నికల్లో అస్పష్టమైన ఫలితాలు వెలువడటంతో మళ్లీ 28న నిర్వహించిన బ్యాలెట్ పోరులో నషీద్ తిరుగులేని విజయాన్ని నమోదుచేశారు. దేశ నూతన రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు 50 శాతం ఓట్లు సాధించడం అవసరం. 54.2 శాతం ఓట్లు సాధించిన నషీద్ ను విజయలక్ష్మి వరించగా గయూమ్ 45.8 శాతం ఓట్లత అసంతృప్తితో పరాజయాన్ని అంగీకరించాల్సి వచ్చింది. ఆసియాలో అత్యధిక కాలం పదవిలో ఉన్న నాయకుడిగా గుర్తింపు పొంది 71 ఏళ్ల గయూమ్ అసలు సిసలైన రాజనీతిజ్ఞు కాలేకపోవడం విచారకరం.

ఎన్నికల ఫలితాల అనంతరం "30 సంవత్సరాలుగా మాల్దీవులకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు" అని అబ్దుల్ గయూమ్ ప్రకటించారు. గయూమ్ నిజంగానే ప్రజలకు రుణపడి ఉన్నారు. ఆయన విధానాలను ప్రజలు వ్యతిరేకించినా రక్తపాతం, హింస లేకుండా రాజ్యాధికారం బదిలీకి వారు ఎంతో కాలం వేచి చూశారు. అపరిమితమైన సహనం వహించారు. కానీ గయూమ్ తన హయాంలో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించినట్లయితే మరో 30 ఏళ్ల పాటు పరిపాలించడానికి ప్రజలు అవకాశం కల్పించేవారేమో?

ఇంకా

నిజాయితీకి మారుపేరు నషీద్

గయూమ్: క్రమంగా...నియంతగా

ఆసియాలో ప్రజాస్వామ్యం


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved