17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ప్రధాని గల్ఫ్ దేశాల పర్యటన

Indian Prime Minister Dr. Manmohan Singh  with His Highness Sheikh Hamad Bin Khalifa Al Thani, Emir of the State of Qatar, in Doha; Photo Src -PMO

ప్రధాని మన్మోహన్ సింగ్ నవంబరు 8నుండి 10వరకు ఒమాన్, కతార్ దేశాలలో పర్యటించారు. మన్మోహన్ ప్రధాని భాద్యతలు చేపట్టిన తరువాత గల్ఫ్ దేశాలలో పర్యటించడం ఇదే ప్రధమం. నవంబరు 8-9 లలో ఒమన్లోను, 9-10 తారీఖులలో కతార్‌లోను పర్యటించారు. ప్రవాస భారతీయుల వ్యవహారాల శాఖ మంత్రి వయలార్ రవి, విదేశాంగశాఖ సహాయమంత్రి ఇ. అహ్మద్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు ఎం.కె. నారయణ్‌లు ప్రధాని వెంట ఉన్నారు.

ఒమన్ పర్యటనలో

ప్రధాని మన్మోహన్ శనివారం నాడు మస్కట్ చేరుకున్నారు. ఒమన్ ఉప ప్రధాని సయ్యిద్ ఫహ్ద్ బిన్ మహమూద్ బిన్ మహ్మద్ అల్ సెడ్ మన్మోహన్ సింగ్‌కు ఘన స్వాగతం పలికారు. తదనంతరం రూ. 50 కోట్లతో భారత్ - ఒమన్ నిధిని ఏర్పాటు చేయడానికై యంవోయూపై సంతకాలు జరిగాయి. ఇరు దేశాల్లో మౌలిక వసతుల ప్రజెక్టుల కోసం ఉపయోగించే ఈ నిధిని భవిష్యత్‌లో రూ. 500 కోట్లకు పెంచనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఒమన్‌లో పనిచేసే భారతీయుల ప్రయోజనాలకు సంబంధించిన మరో అవగాహనా పత్రంపై కూడా ఇరు దేశాలు సంతకాలు చేసాయి. ఒమన్‌లోని వ్యాపరవర్గాలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పధాని ప్రసంగించారు. ఇరుదేశాల మధ్య వ్యాపార సంబంధాలు ప్రాచీనమైనవని అయ్యన అన్నారు, ఇప్పటికే అనేక రంగాలలో భారత ఒమాన్ కంపెనీలు పరస్పర సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయని తెలిపారు. భారత్‌లో మౌలిక సదుపాయాల నిర్మాణం, పర్యాటక రంగం, ఆరోగ్యం, టెలికాం తదితర రంగాలలో పెట్టుబడులను ఆయన ఆహ్వానించారు. ఇరు దేశాల మధ్య వ్యాపారాన్ని పెంచడానికి అన్ని విధాలా సహాయ పడతామని అన్నరు. ఒమన్‌లోని భారతీయులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని భారత దేశ అభివృధికి వారి చేయూతను ప్రశంసించారు.

కతార్ పర్యటనలో

ప్రధాని ఖతార్ పర్యటనలో భాగంగా ఇరుదేశాలు సోమవారం చారిత్రాత్మక రక్షణ సహకార సంబంధంపై సంతకాలు చేసాయి. రక్షణ, భద్రత, సముద్ర గస్తీ, ఉగ్రవాదం, హవాలా, ఖండాంతర నేరాలపై సమాచార పంపిణీ వంటి పలు కీలక అంశాలపై కూడా సంతకాలు జరిగాయి

ఖతార్‌తో కుదురిన రక్షణ ఒప్పందం ఆ దేశ భద్రతా సమస్యలకు పరిష్కారం చూపడమే గాక భారత్ ప్రయోజనాలను కూడా కాపాడుతుందని విదేశీ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఒప్పందంద్వారా చమురు సంపన్న గల్ఫ్ ప్రాంతంలో భారత్ రక్షణ దళాలు తొలిసారిగా రక్షణ బాధ్యతలు చేపట్టనున్నాయి. భారత రక్షణ కార్యదర్శి విజయ్ సింగ్, ఖతార్ రక్షణ కార్యదర్శి ఆదివారం జరిపిన చర్చలలో ఈ అంగీకారం కుదిరింది. అలాగే శాంతిభద్రతలు, సైనిక బలగాల మోహరింపు ఒప్పందంపై భారత్, ఖతార్ విదేశీ వ్యవహారాల సహాయమంత్రుల సంతకాలు చేశారు.

ఈ ఒప్పందాలతో ద్వైపాక్షిక సంబంధాలు నూతన దశకు చేరనున్నాయి.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved