17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

రాజస్థాన్: రాజేకు కష్టకాలం

రాజస్థాన్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా గత అయిదేళ్ల నుంచి ఏకదాటిగ చక్రం తిప్పితున్న ముఖ్యమంత్రి వసుంధరా రాజేకు డిసెంబరు 4న జరగనున్న ఎన్నికలు అగ్నిపరీక్షను తలపిస్తునాయి. గత అయిదేళ్ళుగా ఆమెకు అధిష్టానం అండ పుష్కలంగా లభించినప్పటికీ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దలేకపోయారు. 200 స్థానాల రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ బలం 120. కేవలం 56మంది ఎమ్మేల్యేలతో కాంగ్రెస్ ఆమెకు అడుగడుగునా ఇబ్బందులు సృష్టించింది. మరో 24 మంది ఇండిపెండెంట్లు ఉన్నప్పటికి వారి ప్రభావం నామమాత్రమే. ఎస్టీ హోదాకోసం మే నెలలో గుజ్జర్లు చేసిన ఆందోళన రాష్ట్రాన్ని అట్టుడికించింది. రాజధాని నగరం జైపూర్‌లో బాంబు పేలుళ్ళల్లో 63మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంఘటన రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని ప్రశ్నార్థకం చేసింది. వసుందరా రాజేకు మరోసారి ముఖ్యమంత్రి పీఠం అప్పగించేందుకు హైకమాండ్ అనుకూలంగానే ఉంది. మరో పక్క వసుంధరా రాజేను నిలువరించేందుకు పీసీసీ అధ్యక్షుడు అశోక్ గెహ్లోట్ అలుపెరగకుండా పనిచేస్తున్నారు. గుజ్జర్ల ఆందోళన, శాంతి భద్రతల పరిస్థితి చూపి బీజేపీని దెబ్బతీయాలన్నది ఆయన వ్యూహం. అధికారికంగా ప్రకటించనప్పటికీ, పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి పీఠం అశోక్ గెహ్లోట్‌కు దక్కటం ఖాయం.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved