17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

మధ్యప్రదేశ్ ముఖచిత్రం

ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ముఖ్యమైనది. 2003 ఎన్నికల్లో దిగ్విజయ్‌సింగ్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కంగు తినిపించి అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ అయిదేళ్ళలో ముగ్గురు ముఖ్యమంత్రులను నియమించి అప్రతిష్ట మూటకట్టుకుంది. 171 సీట్లు, 42.6 శాతం ఓట్లతో ఘనవిజయం సాధించి గద్దెనెక్కిన బీజేపీకి అనతికాలంలోనే సమస్యలు ఆరంభమైయ్యాయి. కర్ణాటకలోని హుబ్లీ ఈద్గా మైదానంలో జాతీయజెండా ఎగురవేసిన కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి ఉమాభారతి అనివార్యంగా పదవినుంచి వైదొలగగా ఆమె స్థానంలో బాబూలాల్ గౌర్ అధికార పగ్గాలు చేపట్టారు. మళ్ళీ సీఎం పదవిని ఆశించిన ఉమాభారతికి చుక్కేదురైంది. తర్వాత పార్టీ నుంచి బహిష్కరణకు గురైయ్యారు. గౌర్ తర్వాత ఢిల్లీ నుంచి దిగుమతయిన పార్లమెంట్ సభ్యుడు శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం పీఠం అధిష్టించారు. మొత్తం 230స్థానాల అసెంబ్లీలో బీజేపీ బలం 173 కాగా కాంగ్రెస్ బలం 38 మంది మాత్రమే. ఇండిపెండెంట్లు 11మంది ఉన్నారు. బీజేపీ మళ్ళీ తన సీఎం అభ్యర్థిగా చౌహాన్ పేరునే బలపరుస్తుండగా కాంగ్రెస్ మాత్రం మౌనాన్నే ఆశ్రయించింది. పార్టీ గెలిస్తే తనకు సారథ్యం లభిస్తుందన్న విశ్వాసంతో పీసీసీ అధ్యక్షుడు సురేష్‌పచౌరీ నవంబరు 25న జరిగే ఎన్నికలను ఎదుర్కొంటున్నారు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved