17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు

By జి, శివ కుమార్

ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నగారా మోగించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలపై ఈ ఎన్నికలు ప్రభావంచూపనుండటంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తుంనాయి. తమ కసరత్తును తీవ్రతరం చేశాయి.

మినీ సార్వత్రిక ఎన్నికలుగా భావించే అరు రాష్ట్రాల అసెంబ్లీ ఎనికలకు నగారా మోగింది. తొలుత మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, రాజస్థాన్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం, అక్టోబరు 19న జమ్మూకాశ్మీర్ ఎన్నికల ప్రకటన కూడా వెలువరించడంతో పూర్తిస్థాయి ఎన్నికల వాతావారణం ఏర్పడింది. సాధారణ ఎన్నికలకు రిహార్సల్స్‌గా పేర్కొనే ఈ ఎన్నికలకు పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. నవంబరు 14న ఛత్తీస్‌గఢ్ మొదటిదశతో ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ డిసెంబరు 24న జమ్మూకాశ్మీర్ ఏడోవిడతతో ముగియనుంది. కాశ్మీర్ మినహా మిగిలిన అయిదు రష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబరు 8న జరగనుంది. కాశ్మీర్‌లో డిసెంబర్ 28న ఓట్లు లెక్కిస్తారు. షేడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో లోక్‌సభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు 2009 సాధారణ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనుండటంతో కీలకంగా మారాయి. ఒక్క మిజోరాం తప్ప మిగిలిన రాష్ట్రాల ఎన్నికలు పార్టీలకు ప్రాతిష్టాత్మకమైనవే. కాశ్మీర్, మిజోరాం తప్ప మిగిలిన చోట్ల జాతీయపార్టీలు బలంగా ఉన్నప్పటికీ, ప్రధానంగా ప్రాంతీయపార్టీలదే అక్కడ కీలల పాత్ర. ప్రభుత్వ వ్యతిరేకతపైనే విపక్షాలు దృష్టిసారించి పనిచేస్తుండగా బొటాబొటి మెజారిటీతోనైనా గండం గట్టేక్కేందుకు అధికార పార్టీలన్నీ శక్తివంచన లేకుండా ప్రయాత్నాలు చేస్తున్నాయి. ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల అభ్యర్థులకు బీజేపి ప్రకటించగ కాంగ్రెస్ అలాంటి ప్రస్తావన లేకుండానే ముందుకు సాగుతోంది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved