19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ప్రాంతీయ ఎయిర్‌పోర్టులు: షార్ట్‌లిస్టులో 11 కంపెనీలు

ప్రపంచ ఆర్ధిక మాంద్యం, క్రూడ్ ఆయిల్ ధరలలోని విపరీత మార్పుల నేపథ్యంలో, గత ఆరు నెలలుగ విమానయానరంగం వెనుకబడిందన్న విషయం తెలిసిందే. అయితే వచ్చే రెండేళ్ళలో ఈ రంగం పురోభివృద్ధి సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దిశలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆరు ప్రాంతీయ ఎయిర్‌పోర్ట్‌లను అభివృద్ధి పరిచాలని యోచిస్తోంది. ఒక్కో ఎయిర్‌పోర్ట్‌కు రూ. 200 కోట్లకు పైగా పెట్టుబడి అవసరమని అంచనా. మొత్తం రూ. 1200 కోట్ల పెట్టుబడితో ఆరు ప్రాంతీయ ఎయిర్ పోర్టుల నిర్మాణ పనులకుగాను పదకొండు కంపెనీల పేర్లను ప్రభుత్వం పరిగణిస్తోంది.

రిలయన్స్ ఏయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ లిమిటెడ్(ముంబాయి), ఎన్.ఎస్.కె. ప్రాజక్ట్స్ ఇండియా (బరోడా), శ్రేయ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (కొల్‌కత) కంపెనీలు ప్రభుత్వ షార్ట్‌లిస్ట్‌లో ఉన్నాయి. వీటితోపాటు ప్రాంతీయ కంపెనీలయిన ల్యాంకో డెవలెప్‌మెంట్ కం., మైటాస్, సోమా ఎంటర్‌ప్రైజెస్ కూడా బరిలో నిలిచాయి.

ప్రభుత్వం ఇంతకుముందే తాడేపల్లిగూడెం, రామగుండం, కర్నూలు, ఒంగోలు, బొబ్బిలి, నెల్లూరు, కొత్తగూడెం మరియు నిజామాబాద్ ప్రాంతీయ ఎయిర్‌పోర్ట్ నిర్మాణాలకోసం, ప్రైవేటు రంగం నించి రిక్వెస్ట్ ఫర్ ప్రొపోజల్‌ను సేకరిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఒంగోలు ప్రాజెక్టుకై వాడరేవు అండ్ నిజాంపట్నం పోర్ట్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్‌ సంస్థతో మెమొరాండం ఆఫ్ అసోసియేషన్‌పై సంతకాలు చేసిందని, అలాగే నెల్లూరు ప్రాజెక్టుకై మహరాష్ట్ర డెవలప్మెంట్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక కార్యదార్శి(Infrastructre and Investment Department) కె.వి. బ్రహ్మానంద రెడ్డి తెలియజేసారు


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved