17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ఒబామా విజయం ఖాయం

By జి, శివ కుమార్

సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సగటు అమెరికన్ పౌరుడికి ఒబామా విధానాలు ఊరట కలిగిస్తున్నాయి.బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షపదవి అలంకరించడం ఖాయంగా కనిపిస్తోంది. సర్వేలు నిజమైతే నల్లజాతికి చెందిన ఈ డెమోక్రటిక్ నేత వచ్చే నాలుగేళ్ళలో దేశానికిదిశానిర్దేశం చేస్తారు.
American Elections 2008 Poll Date Nov 4

బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షపదవి అలంకరించడం ఖాయంగా కనిపిస్తోంది. శ్వేతసౌధంలోకి ఒబామా అడుగిడటంలో ఎలాంటి అనుమానాలు లేవని, అంతా లాంఛనమేనని పలు సర్వేలు స్పష్టంగా చాటుతున్నాయి. ఎనిమిదేళ్ళ రిపబ్లికన్ల పాలన అంతమయ్యే రోజు దగ్గర పడిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్ధికంగా దేశం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఒబామా దాదాపు గెలిచినట్లేనన్న అంచనాలు జోరందుకుంటున్నాయి.

నవంబరు 4 న జరగనున్న ఎన్నికల్లో మెక్‌కెయిన్ కన్నా ఒబామానే ముందంజలో ఉన్నారని పలు వార్తా సంస్థలు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ వెల్లడించింది. దాదాపు 40 శాతం ఓటర్లు మెక్ కెయిన్‍కు మద్దతిస్తుండగా, సుమారు 50 శాతం ఓటర్లు ఒబామా వైపు మొగ్గుచూపుతున్నట్లు సర్వేలు పేర్కొంటున్నాయి. ఈ సర్వేలు అత్యంత విశ్వసనీయమైనవిగా గుర్తింపు పొందాయి. 1980 లో రిపబ్లికన్ల అభ్యర్ధి ఒక్క రొనాల్డ్ రీగన్ మినహా అధ్యక్షులుగా ఎన్నికైనవారంతా సర్వేల్లో అగ్రగాములుగా నిలిచిన వారే. సర్వేలో ప్రతికూల ఫలితాలు వచ్చిన ప్పటికీ, ఎన్నికలకు రెండువారాలముందు రీగన్ పుంజుకుని అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి సర్వే విఫలమైన సందర్భం అదొక్కటే కావడం గమనార్హం. రిపబ్లికన్ల కంచుకోట వర్జీనియా రాష్ట్రంలో కూడా ఒబామానే ఆధిక్యంలో ఉండటం విశేషం. 1964 నుంచి డెమొక్రాట్లు గెలవని ఈ రాష్ట్రంలో ఒబామాకు 52 శాతం ఓటర్లు మద్దతిస్తుండగా మెక్ కెయిన్ కు 44 శాతమే లభిస్తుండటం విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది. సర్వేల్లో తాత్కాలికంగా వెనుకబడినప్పటికీ ఎన్నికల నాటికి పుంజుకుంటామన్న మెక్‌కెయిన్ ఆశలు నిజమయ్యే అవకాశాలు కనబడటంలేదు.

అరుదైన ఘట్టం !

సర్వేలు నిజమైతే నల్లజాతికి చెందిన ఈ డెమోక్రటిక్ నేత వచ్చే నాలుగేళ్ళలో దేశానికిదిశానిర్దేశం చేస్తారు. అన్ని దేశాల మాదిరిగా అమెరికా అధ్యక్ష ఎన్నిక ఒక్క ఆ దేశానికి చెందిన వ్యవహారం మత్రమే కాదు. అంతర్జాతీయ సమాజానికి కూడా ఎంతో ఆసక్తి కలిగించే విషయమే. అమెరికా అధ్యక్షుడు అనుసరించే విధానాలు ఆ దేశంపైనే కాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగాఅంతర్జాతీయంగా అమిత ప్రభావం చూపుతాయి.ఒబామా విజయం సాధిస్తే అమెరికా చరిత్రలో అది ఒక అపూర్వ ఘట్టమే అవుతుంది. మెజారిటీ శ్వేతజాతి దేశమైన అమెరికాకునల్లజాతికి చెందిన వ్యక్తి నేతృత్వం వహించడం నిస్సందేహంగా అరుదైన సన్నివేశమే.

సమస్యలతో సతమతం.

సగటు అమెరికన్ పౌరుడు నేడు అనేక సమస్యలతో సతమతమౌతున్నాడు. గ్యాస్, పెట్రోల్ ధరలు బాగా పెరిగాయి. నిరుద్యోగం ప్రబలింది. ఆహార పదార్ధాల ధరలు చుక్కలనంటాయి. ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతోంది. ఫలితంగా అమెరికన్లు తీవ్రస్థాయి ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీ పట్ల ఓటర్లలో వ్యతిరేకత ఏర్పడింది. ఆపార్టీ అభ్యర్ధి జాన్ మెక్ కెయిన్ పై దీని ప్రభావం కనబడుతోంది. దేశ అర్ధిక సంస్థలు కుప్పకూలి పోతుండటంతో వారి ఆశలు నీరుగారుతున్నాయి. పొదుపుచేసిన డబ్బు, బీమా పథకాలు, పింఛను పథకాలు ఏమైపోతాయో నన్నఆందోళన వారిలో గూడు కట్టుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి దేశంలో దాదాపు 20 లక్షల మంది ఏడునెలలుగా ఉపాధి లేకుండా ఉన్నారని కార్మిక శాఖ గణాంకాలు ఘోషిస్తున్నాయి. మొత్తం నిరుద్యోగుల్లో వీరు 21 శాతం ఉన్నారని అంచనా. ఆర్ధిక సంస్థలతోపాటు గృహనిర్మాణం, ఆటోమొబైల్ రంగాల్లో మూకుమ్మడిగా ఉద్యోగుల తొలగింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ జనాభాలో నిరుద్యోగుల శాతం అయిదేళ్ళ గరిష్ట స్థాయి ( 6.1 ) కి చేరుకుంది. ప్రస్తుత పరిస్థితి వల్ల తనఖా రుణాలు (Mortgage Loans) , క్రెడిట్ కార్డుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది.

పేజి   1 |   2 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved