17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ఉగ్రవాదం పై పోరు - నిద్రిస్థున్న ప్రభుత్వం, చెలరేగుతున్న ఉగ్రవాదులు

మన పాలకులు పదవులను కాపాడుకునేందుకు ఇచ్చే ప్రాధాన్యతలో వందోశాతం కూడా ప్రజల శాంతి భద్రతల పరిరక్షణకు ఇవ్వడం లేదు. వరుస దాడులతో కేంద్ర హోశాఖ అసమర్థత ప్రస్పుటమవుతోంది.

ఉగ్రవాదులమని చెప్పుకునే దద్దమ్మలు మరోసారి చలరేగి అసోంలో మారణహోమం సృష్టించి చెవలేని సర్కార్‌కు మరోసవాల్ విసిరారు. దాడులు జరిగినప్పుడల్లా భీకరాలు పలికే ప్రభుత్వం యధావిధిగా నిద్రావస్థను విడనాడకపోవడం టెర్రరిస్టులకు అయాచితవరంగా మరుతోంది. ఈ రాక్షసక్రీడ ఉగ్రవాదులకు చెలగాటం...ప్రజలకు ప్రాణసంకటంగా మరుతోన్నా, పాలక ప్రభువులు కల్లబొల్లి సంతాపాలతో కాలం గడుపుతున్నారేగానీ ఉద్దరించిందంటూ ఏమీలేదు. దేశవ్యాప్తంగా రక్తపుటేర్లు పారుతున్నా ఏమాత్రం చలించక అధికార సింహాసనాలను అంటిపెట్టుకున్న నాయకులకు ఎలా ఉందో తెలియదు కానీ శాంతి భద్రతలు కాపాడలేని ప్రభుత్వం వల్ల ప్రజల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అక్టోబర్ 30న అసోంలో జరిగిన మరణమృదంగంలో 75మంది అమాయక ప్రజలు మృత్యువాతపడగా 500 మందికి పైగా గాయాలపాలయ్యారు. (ఈ ఏడాది ఇప్పటివరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో 200మందికి పైగా మృతి చెందగా వేలాదిమంది క్షతగాత్రులయ్యారు. )

మన పాలకులు పదవులను కాపాడుకునేందుకు ఇచ్చే ప్రాధాన్యతలో వందోశాతం కూడా ప్రజల శాంతి భద్రతల పరిరక్షణకు ఇవ్వడం లేదు. వరుస దాడులతో కేంద్ర హోశాఖ అసమర్థత ప్రస్పుటమవుతున్నా సదరు శాఖా మంత్రి వర్యులు మాత్రం కుర్చీని వీడనంటే వీడనంటూ మొండికేయడం విశేషం.

తిండీ లేదు - శాంతీ లేదు

సుపరిపాలన ఎలాగు సాధ్యం కాదు... కనీసం ప్రజల ప్రాణాలను కూడా కాపాడలేని ప్రభుత్వాలు అవసరమా అన్న ప్రశ్న ప్రజల్లో కలుగుతోంది. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ఒకపూట తిని ఒకపూట తినకుండా బతుకుదామనుకున్నా కనీసం ప్రజల ప్రాణాలకు కూడా ప్రభుత్వం భద్రత కల్పించకపోవడం సిగ్గుచేటు. ఏకంగా దేశ ప్రార్లమెంట్‌పైనే దాడి జరిగినా అవగింజంత కూడా సిగ్గుపడని మన నేతలు అసోం వంటి సాధారణ దాడులతో అప్రమత్తం కాగలరని ఆశించడం మూర్ఖత్వమే కాగలదు.

తుప్పుపట్టిన ఉక్కుపాదం

తీవ్రవాదులు తెగబడినప్పుడల్లా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచి వేస్తామని పాడిన పాటే పాడటం మన అధినాయకులకు సాధారణమైపోయింది. దాడుల ప్రాంతాల్లో మొక్కుబడిగా పర్యటించడం...బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించి చేతులు దులుపుకోవడం... అత్యవసర సమావేశాలను నిర్వహించడం...దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్‌ను ప్రకటించడం...ఇది తప్ప ధీర్ఘకాలిక ఉపసమనానికి చర్యలు చేపట్టడం లేదు. సర్కార్ విధానాలు ఈ విధంగా ఉండగా ప్రభుత్వ ఉక్కుపాదం ఏనాడో తుప్పుపట్టి అటకెక్కిందని జాతి ప్రజలు నిర్వేదంతో నవ్వుకుంటున్నారు. శాంతి భద్రతలు పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా వేలాది కోట్ల రూపాయలను మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చుపెడుతున్నా ఫలితం మాత్రం నామమాత్రమే. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా శాంతి భద్రతల పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉంది. దాడులకు తెగబడ్డ ఉగ్రవాదులను పట్టుకోవడంలోను... పట్టుకున్న ఉగ్రవాదులను కఠినంగా శిక్షించడంలోను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతునాయన్నది పచ్చినిజం. పట్టుబడ్డ ఉగ్రవాదులను శిక్షిస్తే ఒక మతానికి చెందిన ఓట్లు పడవన్న రాజకీయంతోనే మన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయన్న వాదన కూడా ప్రజలలో లేకపోలేదు.

విపక్షాలకూ అంతా రాజకీయమే

దాడులు జరిగినప్పుడల్లా ఉగ్రవాదాన్ని అణచి వేస్తామంటూ భీకర ప్రతిజ్ఞలు చేయడం తప్ప సర్కార్ కొత్తగా ఏం ఉద్దరిస్తోందంటూ ఒక ప్రక్క ప్రజలు నిరాశ నిస్పృహలతో ఆందోళన చెందుతుండగా మరోపక్క విపక్షాలు "మేమున్నాం" అంటూ శవరాజకీయాలతో ఓటు సంబరాలకు ముస్తాబవడం బాధాకరపరిణామం.

చలనం లేని ప్రభుత్వాలు అధికారంలో ఉన్నంతకాలం దేశ శాంతి భద్రతలు ఎలా మెరుగుపడగలవు! ఏది ఏమైనా ప్రభుత్వం నిద్రావస్థలో కొనసాగుతున్నంత కాలం ఉగ్రవాద దద్దమ్మల మారణహోమాలకు ఇప్పట్లో తెరపడేట్టు లేదు.

ఇంకా


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved