22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

భారతీయులకు అందుబాటులో అంతరిక్ష విహారం

వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌వేస్ స్థాపకుడైన రిచర్డ్ బ్రాన్‌సన్ 2009వ సంవత్సరం చివరినుంచి రెగ్యులర్‌గా స్పేస్ ఫ్లైట్లను నిర్వహించాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. ఈయనకు సంబంధించిన వర్జిన్ గలాక్టిక్ కంపెనీ భారత దేశంలోఒక ఏజెంట్ కంపెనీనినియమించింది. వర్జిన్ గెలాక్టిక్ నిర్వహించబోయే అంతరిక్ష విహారానికి ఒక మనిషికి దాదాపు 2 లక్షల అమెరికన్ డాలర్లు అంటే 80 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పటికే 200 మంది ఈ అంతరిక్ష ప్రయాణానికి టిక్కెట్లు కొనుగోలు చేశారు. వీరిలో నలుగురు భారతీయులు కూడా వున్నారు.త్వరలోనే మరికొన్ని కంపెనీలు స్పేస్ టూరిజంలోకి వస్తాయని భావిస్తున్నారు.

మరి కాలుష్యం మాటో?

ఎయిర్ ట్రాన్స్‌పోర్టేషన్(విమానయాన రంగం) వలనగ్రీన్‌హౌస్వాయువుల విడుదల పెరుగుతుంది. దీనితీ భూతాపం పెరిగి దృవ ప్రాంతాలలో మంచుకొండలు కరిగిపోతున్నాయి. అమెరికా మాజీ ఉపరాష్ట్రపతి అల్ ‌గోర్‌తో సంయుక్తంగా రాబర్ట్ బ్రాన్‌సన్ గ్రీన్ హౌస్ వాయువుక విడుదలను తగ్గించే మార్గంచూపించిన వారికి 25 మిలియన్ల డాలర్ల విలువైన "ఎర్త్ ఛాలెంజ్ ప్రైజ్‌" ను 2008 ఫిబ్రవరిలోప్రకటించారు. విమానాలతో పోలిస్తే స్పేస్ షటిల్స్,మరియు స్పేస్ షిప్స్ వలన ఎక్కువ కాలుష్యం ఏర్పడుతుంది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించటానికి ప్రయత్నిస్తున్న రిచర్డ్ బ్రాన్‌సన్ తనే స్పేస్ టూరిజం ప్రారంభించడం ద్వారా కాలుష్యం పెరగటానికి కారణం కాబోవటం విమర్శలకు దారి తీస్తున్నది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved