19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

అంతరిక్షామే భవిష్యత్ కదనరంగం

ఇప్పుడు చైనా అంతరిక్ష పరిజ్ఞానం పెంచుకోవటంతో భవిష్యత్ కదనరంగం అంతరిక్షమే నన్న చీకటి ఊహలూ వినపడుతున్నాయి.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వాటి ప్రటి ప్రయోజనాలు మానవ హితానికంటే వినాశనానికి, యుద్ధతంత్రాలకే అధికంగా ఉపయోగ పండిందన్నది చారిత్రిక సత్యం. ఇప్పుడు చైనా అంతరిక్ష పరిజ్ఞానం పెంచుకోవటంతో భవిష్యత్ కదనరంగం అంతరిక్షమే నన్న చీకటి ఊహలూ వినపడుతున్నాయి.

చైనా గత ఏడాది అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న ఒక నిరుపయోగ ఉపగ్రహాన్ని కూలచివేసింది. ఈ పరిణామం అమెరికా రష్యాల శీతల యుద్ధం రోజుల "స్టార్ వార్"ఉహాగానాలను తిరిగి తెరమీదకు తీసుకువచ్చింది. అంతరిక్షాన్ని యుద్ధభూమిగా మార్చటం పై ప్రపంచదేశాలు తమ తీవ్ర వ్యతిరేకాన్ని తెలియజేసాయి. విశ్వాన్ని శాంతియుత ప్రయోజనాలకే ఉపయోగించాలన్న ఆశయాలకు ఇది విఘాతం కలిగిస్తుందని వాపోయాయి. భారత్‌లో సహజంగానే ఈ విషయంపై ఆందోళన వ్యక్తమయ్యింది.

చైనా సైనిక పాటవానికి ధీటుగా భారత్ సమాధానమివ్వాలని సైనికదళాల ప్రధానాధికారి జనరల్‌ దీపక్‌ కపూర్‌ బహిరంగంగానే ప్రకటించారు. "అంతారిక్షాన్ని వినియోగించుకొనే పనిని భారత సైన్యం ప్రణాళికా బద్ధంగా చేపట్టాలి. అంతరిక్ష ప్రయోజనాలను సైనికావసరాలకు వినియోగించుకొనే దిశగా సాగాలి' అని ఆయన అన్నారు. భారత్ మొదటినుండి స్టార్ వార్‌(అంతరిక్షంలో సైనికీకరణ ) కు వ్యతిరేకంగానే వుంది. చైనాకు ధీటుగా సమాధానం చెప్పటానికి 860 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపగ్రహాన్ని ఖండాంతర క్షిపణితో నాశనం చేయాల్సి ఉంటుంది. మన సేనల క్షిపణులకు 200 కిలోమీటర్ల వ్యాసార్ధం ఉన్న ఎలాంటి ఖగోళవస్తువునైనా ఛేదించే సామర్థ్యం ఉన్నది. ఇప్పుడు భారత్ ఉపగ్రహలను కూల్చినట్లైతే తన మౌలిక సిద్ధాంతాలను వదిలుకున్నట్లవుతుంది.

ఇదిలావుండగా, చైనా అంతరిక్షంలో ఉపగ్రహాన్ని కూల్చడం ద్వారా భారత్‌కే కాక అమెరికాకు కూడా హెచ్చరిక చేసినట్లయింది. ఇంతవరకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తన సైనిక పాటవాన్ని అమెరికా ప్రదర్శిస్తూ వస్తోంది. ఇకపై తన జీ.పీ.యస్ నావిగేషన్ శాటిలైట్ వ్యవస్థ, సైనిక ఘూడచర్య ఉపగ్రహాలు తదితర అంతరిక్ష సైనికవ్యవస్థలను చైనా ఎక్కుపెట్టగలదన్న విషయం స్పష్టమైయ్యింది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved