19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

స్పేస్ హిస్టరీ - క్లుప్తంగా

సోవియట్ రష్యా "స్పుత్నిక్ " ఆరంభించిన స్పేస్ హిస్టరీ - క్లుప్తంగా

ఖగోళం మానవాళినిమెదటినుండి ఆకర్షిస్తూనే వుంది. పురాతన కాలం నుండి మన భారతీయ గణిత, ఖగీళ శాస్త్రజ్ఞులు తమ నిశిత పరిశోధనా శక్తితో ఎన్నో ఖగోళ రహస్యాలను కనిపెట్టరు. ఇతర నాగరికతలలో కూడా ఖగోళంపై ఆసక్తి మనకు కనపడుతుంది. సోవియట్ రష్యా "స్పుత్నిక్ " ఆరంభించిన నూతన శకం ఎన్నో కొత్త విషయాలను ప్రయోగాత్మకంగా మనకు తెలిపింది. ఖగోళ పరిశోధనలు ముందుకు తీసుకువెళుతూ భూమికి దగ్గరి బంధువు చందమామను పలుకరించేదు భారత్ సమాయత్తమైన ఈ తారుణంలో స్పెస్ హిష్టరీ క్లుప్తంగా...

  • 1957 అక్టోబరు 4న మొదటిసారిగాక్రుత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1 రోదసి లోకి ఎగసి,మన సహజ ఉపగ్రహం చంద్రుడిలా, భూమి చుట్టూ పరిభ్రమించింది.బైకనూర్ కాస్మోడ్రో నుండి సోవియట్ ఆర్-7రాకెట్ ద్వారాసోవియట్ యూనియన్ స్పుత్నిక్-1 ను ప్రయోగించింది. మూడునెలలపాటు భూమి చుట్టూ పరిభ్రమించిన స్పుత్నిక్-1 ఎమ్ 1958 జనవరి 4న భూమి వాతావరణం లోకి తిరిగి ప్రవేశిస్తూకాలిపోయింది.
  • స్పుత్నిక్-1 ప్రయోగంతో సోవియట్ యూనియన్,అమెరికాల మధ్య అంతరిక్ష రంగంలో ఆధిపత్య పోరు మొదలైంది.
  • అమెరికా చంద్రుడిపై మానవసహిత ప్రయోగాన్ని చేపట్టక మునుపు అనేకసార్లు రష్యా అంతరిక్షనౌకలు చంద్రుడిపై ఎన్నో పరిశోధనలు నిర్వహించి,చంద్రుడి శిలల నమూనాలను భూమికి తీసుకురాగలిగాయి.
  • 1990 దశకం మొదట్లో 16 దేశాలు పాల్గొనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐ.ఎస్.ఎస్)నిర్మాణానికి అమెరికా,రష్యా మధ్య ఒప్పందం కుదరడంతో అంతరిక్షరంగంలో ఆధిపత్య పోరు అంతర్జాతీయ అంతరిక్ష సహకారంగా మారింది.

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved