19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

చందమామ దిశగా ఆశియా దేశాలు (జపాన్, చైనా)

భారత్‌ కాక జపాన్, చైనాలు కూడా చంద్రుని అధ్యయనం జరుపుతున్నాయి. ఈ రెండు దేశాలు కూడా భారత్ కంటే ముందుగానే చంద్రుని అధ్యయనానికి అంతరిక్షనౌకలను ప్రయోగించాయి.

జపాన్ సెలీన్ ( కగుయా ):

2007 సెప్టెంబరు 14 న చంద్రుడిపైకి తన మొదటి మానవరహిత లూనార్ ఆర్బిటర్ సెలీన్-1 ( కగుయా )ను జపాన్ విజయవంతంగా ప్రయోగించింది. దీంతో ఆసియాలో చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని ప్రయోగించిన మొదటి దేశంగా జపాన్ రికార్దుకెక్కింది. 279 మిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మించిన సెలినాలజికల్ అండ్ ఇంజినీరింగ్ ఎక్స్‌ప్లోరర్ (లేదా సెలీన్) ను క్యూషు ద్వీపంలో దక్షిణాన ఉన్న లెనెగషియా అంతరిక్షకేంద్రం నుండి జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ ( జె ఎ ఎక్స్ లు ) ప్రయోగించింది. 2004 లో లూనార్-ఎ అనే ఉపగ్రహాన్ని చంద్రుడిపైకి ప్రయోగించాల్సివున్నా జపాన్ దాన్ని కొన్ని ఆర్ధిక, సాంకేతిక కారణాలచే వాయిదావేసింది.అక్టోబర్ 4 న సెలీన్ (కగుయా ) చంద్రుడిపై కక్ష్యలోకి చేరింది. కగుయాలో చంద్రుడి చుట్టూ పరిభ్రమించే ఒక ప్రధాన ఆర్బిటర్, రెండు చిన్న ఉపగ్రహాలు ఉన్నాయి. ప్రధాన ఆర్బిటర్ చంద్రుడి 100 కి.మీ ఎత్తులోని కక్ష్యలో పరిభ్రమిస్తుంది. మిగతా రెండు ఉపగ్రహాలు ధృవ కక్ష్యల్లో చంద్రుడి చుట్టూ తిరుగుతాయి. వివిధ రకాల సెన్సర్లతో కూడివున్న ప్రధాన ఆర్బిటర్ చంద్రుడి ఉపరితలాన్ని పూర్తిగా చిత్రీకరించి చంద్రుడి నిర్మాణం, ఉప నిర్మాణం, ఖనిజాలను శోధిస్తూ చంద్రుడి పై ఉండే హిమ ప్రాంతాలను వెదుకుతుంది. ప్రధాన ఆర్బిటర్ నుండి భూమికి సమాచారాన్ని చేరవేయడానికి మిగతా రెండు చిన్న ఉపగ్రహాలు తోడ్పడతాయి. వీటి ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా చంద్రుడి ఆవిర్భావాన్ని,పరిణామాన్ని అర్ధంచేసుకోవడానికి వీలవుతుంద. సెలీన్ ప్రయోగంద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా 2012 లో చంద్రుడిపై ప్రయోగించనున్న ఒక రోవర్ను రూపొందించనున్నట్లు కూడా జె ఎ ఎక్స్ లు వెల్లడించింది. చంద్రుడిపై రష్యా చేపడుతున్న "లూనార్ గ్లోబ్" అనే సరికొత్త ప్రాజెక్టులో జపాన్ భాగస్వామ్యంపై చర్చలు జరుగుతున్నాయి.

చైనా చాంగే-1

చైనా కూడా తన మొదటి చంద్ర మండల ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. చాంగే-1 (changey ) అనే ఒక చంద్రమండల అన్వేషక ఉపగ్రహాన్ని లాంగ్ మార్చ్ 3ఎ రాకెట్ ద్వారా క్సిచాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి 2007 అక్టోబరు 24న ప్రయోగించారు.చైనా ఇంతకు మునుపెన్నడూ ప్రయోగించని అత్యాధునిక ఉపగ్రహంగా చాంగే-1 రూపకల్పన జరిగింది. నవంబర్ చివర్లో చంద్రుని పైనుండి తీసిన ఛాయాచిత్రాలను చాంగే-1 భూమికి ప్రసారం చేస్తుంది. దీని తరువాత ఒక ఏడాది పాటు చంద్రుడిపై అనేక సాంకేతిక పరిశోధనలను ఇది నిర్వహిస్తుంది. చంద్రుడి 3-డి (త్రీడి)చిత్రాలను తీయడంతో పాటు చంద్రుడి ఉపరితలంలో ఉండే మూలకాలను కూడా చాంగే-1 విశ్లేషిస్తుంది. 2012 కల్లా చంద్రుడి ఉపరితలంపై నడిచే ఒక రోవర్‌ను ప్రయోగించి,2020 నాటికి చంద్రుడిపైకి ఒక మానవ సహిత ప్రయోగాన్ని చేపట్టాలని చైనా లక్ష్యం.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved