19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

డీప్ స్పేస్ నెట్‌వర్క్ (డిఎస్సెన్)

Deep Space Network ISRO 32m Antenna at Byalalu డీప్ స్పేస్ నెట్‌వర్క్ (డి యస్ యన్) అనే భారీ గ్రౌండ్ స్టేషన్‌ను ఇస్రో అభివృద్ధి చేస్తోంది. ఇది బెంగుళూరు సమీపంలోని బ్యాలాలు అనే ఒక గ్రామంలో ఉంది. చంద్రయాన్-1, చంద్రయాన్-2 ఉపగ్రహాలనుండి సమాచారాన్ని గ్రహించేందుకు వీలుగా పద్దెనిమిది మీటర్ల వ్యాసంకల ఈ భారీ ఎంటెన్నానుఇస్రో ఏర్పాటు చేసింది. అంగరకుడిపై ఇస్రో నిర్వహించబోయే ప్రయోగంలో కూడా ఈ కొత్త ఏంటెన్నా ఉపయోగపడుతుంది. డి.ఎస్.ఎన్ లో భాగం 32 మీటర్ల వ్యాసంలో మరో భారీ ఏంటెన్నాను కూడా ఇదే గ్రామంలో ఏర్పాటు చేస్తున్నారు.2008-09 లో ఇస్రో ప్రయోగించనున్న మొట్టమొదటి ఖగోళ అబ్జర్వేటరీ ఉపగ్రహం Astrosa T కొరకు 11 మీటర్ల వ్యాసంలో మరో ఏంటెన్నాను కూడా ఏర్పాటు చేస్తున్నారు. 18,32,11 మీటర్ల వ్యాసంలో ఉండే ఈ మూడు ఏంటెన్నాల నిర్మాణం జరిగి డి ఎస్ ఎన్ పూర్తి అయితే ఇంత పెద్ద పరిమాణంలో ప్రపంచంలోనే అతి పెద్ద గ్రౌండ్ స్టేషన్ తయారవుతుంది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved