19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ఆహార సంక్షోభం - వ్యవసాయాభివృద్ధే పరిష్కార మార్గం

By కె, ప్రమద

దుర్భర దారిద్ర్యాన్ని నిర్మూలించాలంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు వ్యవసాయంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ బ్యాంకు సూచించింది

ప్రపంచ వ్యాప్తంగా ఆహారపదార్ధాల ధరలు భగ్గున మండుతున్నాయి. ముఖ్యంగా బియ్యం, గోధుముల ధరలు బాగా పెరుగుతున్నాయి. బియ్యం ,గోధుమల ధరలు 2007-08 కాలంలీ బాగా పెరిగాయి. వీటి పెరుగుదల 57శాతం వరకూ వుండవచ్చునని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (F.A.O) వెల్లడించింది.ఆహార ధాన్యాల ధరలలో యిరవై శాతం పెరగదలవుంటే ప్రపచంలో మరో యిరవై కోట్ల జనాభా నిరుపేదలైనట్లే. ప్రస్తుతం ఆహార సంక్షోభం ఎంత తీవ్రస్థాయిలో వున్నదో దీనిని బట్టితెలుస్తుంది. నలభై దేశాలలో అహార సంక్షోభం చాలా తీవ్రస్థాయిలో వుంది. ఈజిప్టు, కెమరూన్, హైతీ, బు ర్కినాఫాసో, సెనగల్ మొదలైన దేశాలలో ఆహారం కోసం దాడులు జరుగుతున్నాయి. అక్రమంగా ఆహార పదార్ధాలను నిల్వవుంచిన వారిని జీవితఖైదు లాంటి కఠినశిక్షలు అమలు చేయాలని ఫిలిప్పీన్ ప్రభుత్వము నిర్ణయించింది.ఆహారధాన్యాలను ఎగుమతి చేసే దేశాలు వాణిజ్య పరమైన ఆంక్షలు విధించాయి. పెట్రోలియం ఎగుమతి చేసే దేశాలసంస్థ(ఒపెక్) తరహాలో బియ్యం ఎగుమతి చేసే దేశాలూ ఒక కూటమిగా ఒరెక్ ను ఏర్పాటు చేయాలని ధాయిలెండ్ ప్రతిపాదించింది.

ఎన్నో కారణాలు

ఎక్కడైనా సరే వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయటమే ఆహార సంక్షోభానికి ప్రధాన కారణమౌతోంది. ప్రపంచ ఆహారఉత్పత్తుల్లో ఏడుశాతం కన్న తక్కువే అంతర్జాతీయ మార్కెట్ లోఅందుబాటులో ఉటోంది. ఆహారధాన్యా లకు బదులు జీవ ఇంధనాల తయారీకి ఉపయోగపడే పంటలు వేయడం వల్లనూ, ఆహారధాన్యాలను జీవ ఇంధనాల తయారీకి మళ్ళించటం వల్ల కూడా ఆహార సంక్షోభం తీవ్రతరమౌతోంది.2007లో తమ దేశంలో ఉత్పత్తి చేసిన మొక్కజొన్నలో ముప్ఫై శాతాన్ని ఇథనాల్ తయారీకోసం ఉపయోగించినట్లు అమెరికా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అగ్రరాజ్యం అమెరికాఉదార వాద మార్కెట్ విధానాలు, ముడి చమురు ధరలు పెరగడంతో బయో ఇంధనాలపై అధిక దృష్టిసారించడం వంటి కారణాల వలన కూడా ఆహారసంక్షోభం తలెత్తిందని ఒప్పుకోక తప్పదు.ఉదారవాదాన్ని భుజానికెత్తుకుంటున్న అమెరికా ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులూ కూడా ప్రస్థుత పరిస్థితిని చూసి ఆందోళన చెందుతున్నాయి. దుర్భర దారిద్ర్యాన్ని నిర్మూలించాలంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు వ్యవసాయంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదలచేసిన ప్రపంచ అబివృద్ధి నివేదికలో సూచించింది.

ఏదిఏమైనా ప్రపంచ ప్రజల ఆకలిబాధ తీరాలంటే వ్యవసాయాభివృద్ధే పరిష్కార మార్గం.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved