22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

వ్యవసాయ భారతం

By కె, ప్రమద

ఇప్పటికీ మన భారతదేశము వ్యవసాయ ప్రధానమైన దేశమే. అయితే, వ్యవసాయ రంగాన్నిపలు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో రైతులకు కనీస స్థాయిలో జీవించే అవకాశం కూడా లేకుండా వుంది.

ఇప్పటికీ మన భారతదేశము వ్యవసాయ ప్రధానమైన దేశమే. దేశంలో 70 శాతం ప్రజలు వ్యవసాయాన్ని, వ్యవసాయాధారిత పనులనీ ఆధారం చేసుకుని బ్రతుకుతున్నారు. "ఇప్పటికీ" అని ప్రత్యేకంగా చెప్పుకోవటమెందుకంటే , స్వాతంత్ర్ర్యానంతర భారతదేశం పారిశ్రామికరంగంలో గణనీయమైన ప్రగతి సాధించింది. వ్యవసాయపరంగా వెనుకబడిపోయింది. పరిశ్రమలకు, పారిశ్రామికవేత్తలకు పెద్దపీటవేసి, వారి వున్నతికి, శ్రేయస్సుకు పాటుపడుతూ పాలక వర్గాలు రైతు క్షేమాన్ని పట్టించుకోవడంలేదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల రైతుల పరిస్థితి ఒకేతీరుగా వుంది. కనీస స్థాయిలో జీవించే అవకాశం కూడా లేకుండా వుంది రైతులకు. వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినందువల్లే అనేకమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

సాగుబడులు పెరిగి పోవడం............గిట్టుబాటు ధర లభించకపోవడం........వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం.............చీడ-పీడలు. .... రైతుల దుస్థితికి ముఖ్యమైన కారణాలు.

మొదటి రెండు సమస్యలను పాలకవర్గాలు పట్టించుకుని పరిష్కరించగల అవకాశమున్నా, పాలకవర్గాలు కావలసినంతగా ముందుకు రావటంలేదు.
  1. ఎనిమిదో దశకంనుండి ఉదారవాద విధాలను అనుసరిస్తూ ప్రభుత్వం వ్యవసాయానికి మద్దత్తును తగ్గించడమే లక్ష్యంగా చేసుకుంది.
  2. వ్యవసాయవుత్పత్తుల ముందస్తు విక్రయాలకు ప్రోత్సాహమిచ్చింది.
  3. వ్యవసాయభూములను పరిశ్రమలకు, ఎగుమతి ప్రోత్సాహక మండలాల ఏర్పాటుకు వినియోగించుకుంది.
  4. ఆహార పంటల స్థానంలో వాణిజ్యపంటలకు అవకాశమిచ్చింది.

వీటన్నింటితో ఆహార పంపిణీ వ్యవస్థ లొసుగులమయంగా తయారయింది.

రాష్ట్రంలో ఎక్కువగా వున్న చిన్న, సన్నకారు రైతులకు అతిచిన్న ఉద్యోగి స్థాయిలో కూడా బ్రతకలేని దుస్థితిలో ఉన్నారు.వారు దారిద్రరేఖ కు చేరువలో కూడా బ్రతకలేని దుస్థితిలో వున్నరు.

ప్రాంతీయ భేదంలేకుండా రాష్ట్రంలోని అన్నిప్రాంతాలలోని సన్న,చిన్నకారు రైతుల పరిస్థితి ఒకేరకంగాఉండటం గమనించవలసిన అంశం. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ లోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం , కొన్ని స్వఛ్చంద సంస్థల సహకారంతో ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. మూడేళ్ళపాటు కొనసాగిన ఈ అధ్యయనంలో, రైతుల దిగుబడులు, ఆదాయ-వ్యయాలను పరిశీలించిన తరువాతే తుది నివేదికలు తయారుచేసింది. జిల్లాలలో వ్యవసాయ పెట్టుబడులు పెంచడం సమతుల్య వ్యవసాయాభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలు చేపట్టటానికి ప్రాధాన్యం యివ్వాలని నివేదిక సూచించింది.

ముందుచెప్పుకున్నట్లు రైతుకు సరైన దిగుబడులు రాకపోవడం, ఒకవేళ వచ్చినా సరైన గిట్టుబాటుధర లేకపోవడం, వానలు లేక కొన్ని సంవత్సరాలుగా పంటలు పండక పొవటంతో రైతు పరిస్థితి దుర్భరంగా తయారయింది.

పండ్లతోటల పెంపకం, ఆర్ధికంగా ఆశాజనకంగా ఉన్నప్పటికీ రైతు పెట్టుబడులను భరించే స్థితిలో లేడు. నమ్మకమైన మార్కెట్ లేకపోవడం కూడా ప్రధాన సమస్య. సమతుల్యమైన వ్యవసాయాభివృద్ధికి అవసరమైన మంచివాతావరణం పశ్ఛిమగోదావరీ జిల్లాలో ఉంది. తరువాత స్థానాలలో తూర్పుగోదావరీ,కరీంనగర్, జిల్లాలను చెప్పవచ్చు. వ్యవసాయాభివృద్ధికి పశ్ఛిమగోదావరీ జిల్లా అనువైనదైనప్పటికీ సామాజిక భద్రత విషయంలో మాత్రం మెరుగ్గా లేదు. పర్యావరణ రంగంలో అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాలు అధ్వాన్నంగా వున్నాయి. ఆర్ధికంగా చూసినప్పుడు కరీంనగర్, పశ్ఛిమగోదావరీ, నెల్లూరు జిల్లాలు వరుసగా మూడు స్థానాల్లో ఉన్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలు వెనుకబడి ఉన్నాయి.

ఏది ఏమైనా ఈదుర్భర దారిద్ర్యాన్నించి రైతును రక్షించాలంటే ప్రభుత్వాలు వ్యవసాయ పెట్టుబడులను పెంచాలి.అప్పుడే గ్రామప్రాంతాల ప్రజల వలసలు తగ్గుతాయి.వ్యవసాయానికి తగినంత ప్రాధాన్యాన్ని యిచ్చి వ్యవసాయాభివృద్దే తమప్రధాన లక్ష్యంగా చేసుకోవాలి.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved