22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

రేడియో అక్కయ్య: తురగా జనకీరాణితో ముఖా ముఖి

By కె, మణినాథ్

పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశి ఆలిండియా రేడియోలో నేటికీ రేడియో అక్కయ్యగా అందరి మదిలో మెదిలే వ్యక్తి తురగా జానకీ రాణిగారు. మంచి రచయిత్రి, సంఘ సంస్కర్త కూడా
Turaga Janaki Rani

మానవుని వినోద సాధనాలు ఎన్ని వచ్చినా నేటికీ వన్నె తరగని సాధనం రేడియో! ఏ పని చేస్తున్నా చెవులు రిక్కించి వినేది ఆకాశవాణి కార్యక్రమాలే! ఆలిండియా రేడియోలో నేటికీ రేడియో అక్కయ్యగా అందరి మదిలో మెదిలే వ్యక్తి తురగా జానకీ రాణిగారు. ఎందరో చిన్నారులు బాలానందంలో తమ కంఠం వినిపించడం వెనుక ఆమె ఉన్నారు. పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను ఆవిడ రూపొందించి వాటిలో చిన్నారులతో ప్రదర్శింపచేశారు. ఎందరో బాలబాలికలకి పబ్లిక్ స్పీకింగ్ భయంపోయి మైక్ లో ధైర్యంగా మాట్లాడటానికి.. వారిలోని సృజనాత్మకతకు ..ఇలా ఎన్నో విషయాలకిబాలానందం ఒక వేదిక అయింది. డాక్టర్లు, లాయర్లు, సినీ తారలు , ఎన్.ఆర్.ఐలు... ఒకరేమిటి ఎందరో ప్రముఖులు తామకు చిన్నతనంలో ఆకాశవాణిలో రేడియో అక్కయ్యతో వున్న అనుభవం మర్చిపోలేరు. నేటికీ ఆమెను ఒక ఆత్మీయురాలిలాగా పలకరిస్తుంటారు...

రేడియో ఆర్టిస్ట్ గానాటకాలలోనూ, ఇతర కార్యక్రమాలలోనూ విశేష అనుభవం వున్నతురగా జానకీ రాణి గారు1975 లో ఆకాశవాణిలో ఉద్యోగంలో చేరారు. 1994లో ఐ.బి.పి.ఎస్. అసిస్టెంట్ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు.

వారితో వారి రేడియో అనుభవాల గురించి కాసేపు...

* ఆకాశవాణిలో మీ ఉద్యోగ బాధ్యతలు ఎలా వుండేవి?

ఛాలెంజింగ్ గా వుండేది. సమయపాలన పాటించడంతో పాటు శ్రోతలకీ న్యాయం చేకూర్చాలి. 1975లో ఉద్యోగంలో చేరినప్పుడు మనదేశంలో ఎమర్జెన్సీ అమలులో ఉండేది. ఆకాశవాణి ద్వారా ప్రభుత్వ పాలసీలు, విధానాలు ప్రజలకి చేరవేయాలి.ఒక ఛాలెంజింగ్ గా వుండేది....నేను ఏ కార్యక్రమం చేసినా ఆమోదించేవారు. స్వేచ్ఛ వుండేది. కార్యక్రమాల్లో వైవిధ్యం రూపొందిచడానికి ప్రయత్నించేదాన్ని.

బాలానందంద్వారా పిల్లల వినోదం, విజ్ఞానం కోసం నాటికలు, రూపకాలు,సంగీత, సాహిత్యకర్యక్రమాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు రూపొందించేవాళ్లం. కొన్ని పెద్దల ద్వారా చెప్పిన విషయాలు బాగుంటాయి. బాలానందం ద్వారా ఎన్నో ప్రయోగాలు చేశాను.

* స్త్రీల కార్యక్రమాలు రంగవల్లి..... వంటి కార్యక్రమాల గురించి...?

మహిళలకోసం కూడా కొత్త ప్రయోగాలు చేసాము. ముఫై సంవత్సరాల కిందటే "ఇది నా సమస్య" అని స్త్రీల కార్యక్రమం ప్రసారం చేసేవాళ్ళం. స్త్రీలు తమ సమస్యలు ఉత్తరాల ద్వారా తెలియ పరిస్తే వాటి పరిష్కారాలు నిపుణులైన డాక్టర్లు, లాయర్లు మొదలైన వారిచేచెప్పేవాళ్ళం. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వుండేది. వందల సంఖ్యల్లో వుత్తరాలు వచ్చేవి. వృద్ధుల కోసం తమ జీవితానుభవాలు తెలిపే "స్రవంతి" అనే కార్యక్రమం మొదలు పెట్టాము. అది ఇప్పటికీ కొనసాగుతోంది. అందరికీ చదువు అని పంచాయితీలలోని స్త్రీలకి పాఠాలు అందించేవాళ్ళం... మహిళలు వారు రాసిన కవితలు, కధలు, పాటలు ఈ కార్యక్రమంద్వారా వినిపించేవాళ్ళు....

* ఆకాశవాణిలో ఒక కార్యక్రమంరూపుదిద్దుకోవడానికి ప్రోగ్రామర్ బాధ్యత ఏవిధంగా వుంటుంది?

ఒక కార్యక్రమం రూపొందించాలంటే ముఖ్యంగా మూడు విషయాలు గమనించాలి.

1. ప్లానింగ్, 2.ప్రోడక్షన్ 3. ప్రెజెంటేషన్. ప్లానింగ్ పర్ ఫెక్ట్ గా వుండాలి. తరువాత ప్రొడక్షన్ లో విలువలుండాలి. ప్రెజెంటేషన్ లో ముఖ్యంగా. అది అందర్నీ ఆకట్టుకునేలా వుండాలి. ఈ మూడు కలిపి తేనే ఏ కార్యక్రమమైనా చక్కగా వుంటుంది. నేను ఎక్కువగా సంగీతాన్ని ఉపయోగించేదాన్ని.

* ఆకాశవాణి గురించి ఇతర విషయాలుచెప్పమన్నప్పుడు....

రేడియో కార్యక్రమానికి మానవ కంఠ ధ్వని, ఇతర శబ్దాలు, విరామం ఎంతో ముఖ్యం. అలాగే రేడియోలో పాల్గొనే వారు ఎక్సపర్ట్స్ కానవసరం లేదు. ఏక్స్‌పీరియన్స్ ముఖ్యం. చెప్పదలచిన విషయాన్ని ఇచ్చిన సమయానికి సమయపాలన పాటించి చెప్పగలగాలి. వృద్ధులు చెప్పే దాంట్లోనూ విలువలుంటాయి.

రేడియో అనేది స్టూడియో నాలుగు గోడల మధ్య ఉండేది కాదు. ప్రజల మధ్యకి వెళ్ళి వారి అనుభవాలు, వాళ్ళ నాలెడ్డ్ తెలుసుకోవాలి అని చాలా క్రార్యక్రమాలు ప్రజల వద్దకి వెళ్లి చేసేవాళ్ళం. సాధారణ ప్రజలని కూడా ఇందులో భాగస్వామ్యులని చేయటం ద్వారా వారి అనుభవాలు నలుగురికీ తెలిసేవి. ఇందులో భాగంగా మేము గోదావరిఖని, జడ్చర్ల, కరీంనగర్, శ్రీశైలం....ఇలా ఎన్నో ప్రదేశాలు తిరిగి కార్యక్రమాలు రూపొందించేవాళ్ళం.

పేజి   1 |   2 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved