22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

లెఫ్ట్ ఫ్రంట్‌లో లుకలుకలు

వామపక్షాల బలం ఎక్కడ?

జాతీయస్థాయిలో 2004 ఎన్నికల్లో తొలిసారి అత్యధికంగా 59 స్థానాలను గెలుచుకున్న ఈ పార్టీలు. .. వచ్చే ఎన్నికల్లో నిలబెట్టుకోగలవా అనేదే ప్రశ్న. బెంగాల్, త్రిపుర, కేరళలలో తప్ప. మిగతా రాష్ట్రాల్లో ఇవి ఎక్కడా రెండో స్థానంలో కూడా లేవు. ఫార్వర్డుబ్లాక్, ఆర్ఎస్పీలకు ఆ 3 రాష్ట్రాల్లోనే కొంత పట్టుంది. మిగతా రాష్ట్రాల్లో నామమాత్రమే. ఉత్తర, పశ్చిమ భారతాల్లో సీపీఎం, సీపీఐల ఉనికి అతి తక్కువ నియోజకవర్గాలకు పరిమితం. ఆయా రాష్ట్రాల్లో ఏదో ఒక ప్రధాన పార్టీపై ఆధారపడి ఒకట్రెండు సీట్లు పొందుతున్నాయి. దక్షిణాదిన కేరళ తర్వాత ఈ రెండు పార్టీలకూ చెప్పుకోతగిన బలముంది ఆంధ్రప్రదేశ్ లోనే. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, కర్నూలు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో వీటికి సమాన బలముంది. విజయనగరం, విశాఖపట్నం, వరంగల్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలపై ప్రభావం చూపగల సత్తా ఉంది. తమిళనాడులో అన్నాడీఎంకేకు దగ్గరవుతున్నాయి. కర్ణాటకలో దేవెగౌడ నేతృత్వతంలోని దళ్ (ఎస్)తో కలిసి నడిచేందుకు పావులు కదుపుతున్నాయి. పలు కార్మిక, ఉద్యోగ సంఘాలు సీపీఎం, సీపీఐలకు అనుబంధంగా ఉన్నా... ఆ మూడు రాష్ట్రాల్లో తప్ప అందులోని సభ్యులు ఈ పార్టీలకు ఓట్లు వేయరు. లోక్ సభ ఎన్నికల్లో మూడో కూటమికి చెప్పుకోతగ్గ సంఖ్యలో సీట్లు వస్తే...భాజపాను అధికారంలోకి రానివ్వకుండా చేసేందుకు మళ్లీ వామపక్షాలు కాంగ్రెస్ కు మద్దతిస్తాయో లేదో వేచిచూడాలి.

పేజి   12 |      

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved