22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

లెఫ్ట్ ఫ్రంట్‌లో లుకలుకలు

By జి, శివ కుమార్

సైధాంతికంగా కలసికట్టుగా వున్నా వామపక్షకూటమికి అంతర్గత వైరాలు తలనొప్పిగా మారాయి.

భారత రాజకీయాల్లో వామపక్షాలు (సీపీఎం. సీపీఐ, ఫార్వరుడ బ్లాక్, ఆర్ఎస్పీ) ప్రత్యేక స్థానం సంపాదించుకున్నా వాటి ప్రాబల్యం పశ్చిమబెంగాల్, త్రిపుర, కేరళలకే పరిమితమైంది. సిద్ధాంతపరంగా మిగతా పార్టీలకు ఇవి పూర్తిగా భిన్నమైనవి. కార్మిక, కర్షక, ఉద్యోగ సంక్షేమం, సామ్యవాదం వాటి విధానాలు. అమెరికా స్రామాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానాలకు బద్ధవ్యతిరేకం. ఇటీవలికాలంలో పెట్టుబడిదారీ విధానంపై కాస్త మెట్లు దిగినట్టు కనిపిస్తున్నా....అమెరికా సామ్రాజ్యవాదంపై మాత్రం రాజీలేని పోరు సాగించాలన్నది వాటి దృఢ నిర్ణయం. ఇందులో భాగంగానే...అమెరికాతో అణు ఒప్పందాన్ని వ్యతిరేకించి యూపీఏ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకున్నాయి.

బెంగాల్ కూటమిలో విబేదాలు

సైద్దాంతికంగా కససికట్టుగా వున్నా, వామపక్ష కూటమికి అంతర్గత వైరుద్ధ్యాలుతలనొప్పిగా మారాయి. పశ్చిమబెంగాల్లోని సింగూరులో టాటా కార్ల ప్రాజెక్టు. నందిగ్రామ్ మారణహోమాలు బెంగాల్లోని ఈ కూటమిలో కలతలు రేపాయి. ఆ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని ప్రభావం స్పష్టంగా కనపడింది. విబేదాల కారణంగా విపక్షాలు కొంత మేర లబ్ధిపొందాయి. ఇక సీపీఎం పెద్దన్న పోకడలు మిగతా మూడు పార్టీలకు మింగుడుపడడంలేదు. నందిగ్రామ్ ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటుని సీపీఐ, పార్వరుడబ్లాక్, ఆర్ఎస్పీలు ఆది నుంచీ వ్యతిరేకించాయి. సీపీఎం మాత్రం వాటిని పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహించి...ఇబ్బందులు కొని తెచ్చుకుంది. సెజ్ ను దాదాపు ఉపసంహరించినా మిత్రపక్షాల విభేదాలు మాత్రం కొనసాగుతున్నాయి.

ఇతర రాష్ట్రాలలోనూ అదే పరిస్థితి

జాతీయ స్థాయిలో సఖ్యతగా ఉంటున్నా...ఆంధ్రప్రదేశ్, బీహారు, ఒరిస్సా వంటి కొన్ని రాష్ట్రాల్లో సీపీఎం, సీపీఐల మధ్య విభేదాలు కలవరం కలిగిస్తున్నాయి. జాతీయ స్థాయిలో తెలుగుదేశంతో కలిసి పనిచేస్తున్నందున ఆంధ్రప్రదేశ్లోనూ దానితో ఎన్నికల పొత్తు పెట్టుకోవాలన్నది సీపీఎం నిశ్చితాభిప్రాయం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మాత్రం ఇందుకు పూర్తిగా విముఖంగా ఉన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం, తెరాసతో కలిసి మూడో కూటమిగా ఏర్పడాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సీపీఎంకు నచ్చడం లేదు.

కేరళ, త్రిపురల్లో కూడా వామపక్షాల మధ్య విభేదాల పర్వం కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఫార్వర్డ బ్లాక్, సీపీఐ విడివిడిగా పోటీచేశాయి. టిక్కెట్ల పంపిణీలో సీపీఎం మొండిగా వ్యవహరిస్తోందని ఒకటీ అరా సీట్లతో సరిపుచ్చుకోమంటుందని ఆ పార్టీలు అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశాయి. అధికార కూటమిలో ఉంటున్నప్పటికి ఇతర పదవుల పంపకాల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నది వాటి వాదన.

పేజి   1 |   2 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved