19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

లాల్ బహదూర్ శాస్త్రీ

దేశంలో హరిత విప్లవానికి బీజం వేసి ఆహార స్వయం ప్రతిపత్తిదిశగా నడిపించన ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి. జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఇచ్చిన నాయకుడు. పాకిస్థాన్‌తో 22రోజుల యుద్ధంలో మన దేశ సైనిక సత్తా చాటిన ప్రధాని

"ఇల్లు లేని హోంమ్ మినిష్టర్" అని పిలిపించుకున్న ఉత్తమ విలువలు కల నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రీ. 1961లో ఆయన నెహ్రూ మంత్రివర్గంలో హోంశాఖా మంత్రిగా పనిచేశారు. ఆయన పదవినుండి వైదొలిగేనాటికి ఆయనకు వుండటానికి ఇల్లుకూడా లేదు. అందుకే ఆయనకా పేరు.

స్వతంత్ర భారత మొదటి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. పార్టీ అభ్యర్ధులను ఎన్నుకునే అధికారం ఆయనదే. కానీ పదవిపై వ్యామోహాంలేక ఆయన లోక్‌సభకు పోటీచేయలేదు. జవహర్ లాల్ నెహ్రూ బలవంతంతో ఆయన రాజ్యసభకు ఎన్నికై రైల్వే శాఖ మంత్రిగా బాధ్యలు నిర్వహించారు. రైల్వే శాఖ మంత్రిగా ఆయన సామాన్య ప్రయాణీకులకు వసతుల కల్పనకు ఎనలేని కృషి చేశారు. ఆరోజుల్లో రాజభోగాలను కలిగిన మొదటి తరగతిని కుదించి బడుగు ప్రజలు ప్రయాణించే థర్డు క్లాసు పెట్టెలలో వసతులు కల్పనకు ఆయన కృషి చేశారు. మూడవ తరగతి రైలు పెట్టలలో ఫ్యానుల వంటి వసతులు ఆయన కల్పించినవే. 1956లో జరిగిన రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామ చేశారు. అంతటి ఉదాత్త భావాలుకల నాయకులు నేడు లేరనే చెప్పాలి.గాంధేయ మార్గంలో తన జీవితాన్ని మలచుకున్న ఆ నాయకుడు ఆ జాతిపిత జన్మదినాన్ని కూడా పంచుకున్నారు.

జీవితం

లాల్ బహదూర్ శాస్త్రి ప్రస్తుత ఉత్తర ప్రదేశ్(అప్పటికి యునైటెడ్ ప్రావిన్స్ అని పిలిచేవారు)లోని మెఘల్ సరాయిలో అక్టోబర్ 2, 1904 న శారదా ప్రసాద్, రామ్‌దులారీ దేవీల ఇంట జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోగా వారి మేనమామ రఘునాథ్ ప్రసాద్‌గారింట పెరిగారు. ప్రాథమిక విద్యానంతరం కాశీలోని జాతీయవాద కాశీ విద్యాపీఠములో చదువుకున్నారు. అక్కడ విద్యాభ్యాసము అనంతరము 1926లో "శాస్త్రి" అనే పట్టా పుచ్చుకున్నారు. 1928లో ఆయన లలితా దేవిని పెళ్ళాడారు. కట్నానికి తాను వ్యతిరేకమైనప్పటికీ, తన మామగారు గణేష్ ప్రసాద్ బలవంతం చేస్తే ఐదు గజాల ఖాదీ బట్టను అడిగి తీసుకున్నారు!

1921 మెదలు 1942 మధ్య కాలంలో అన్నీ స్వాంతంత్ర్యోద్యమ పోరాటాలలో ఆయన పాలుపంచుకున్నారు. ఏడుసార్లు జైలుపాలయ్యారు. మెత్తం తొమ్మిది సంవత్సరాలు ఆయన జైలులోనే గడిపారు. 1930 అలహాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. 1937లో ఉత్తరప్రదేశ్ అశెంబ్లీకి ఎన్నికయ్యారు. 1951లో రాజ్యసభకు ఎన్నికై రైల్వేశాఖా మంత్రిగా పనిచేశారు. 1957లో ఎన్నికల అనంతరం తిరిగి నెహ్రూ మంత్రి వర్గంలో తొలుత రవాణా, సమాచార శాఖా మంత్రిగా, తరువాత వాణిజ్య శాఖా మంత్రిగా పనిచేశారు. 1961లో హోంమత్రిగా బాధ్యతలు చేపట్టారు.

పేజి   1 |   2 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved