19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

పైస్థాయి న్యాయమూర్తుల తొలగింపు - రాజ్యాంగం ఏమంటోంది?

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు ప్ర్రక్రియ ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో క్లిష్టతరమైనది. సుదీర్ఘమైనది. తొలుత రాజ్యాంగంలోని 124(4) అధికరణం ప్రకారం నూరమంది లోక్‌సభ సభ్యులు లేదా యాభైమంది రాజ్యసభ సభ్యులు న్యాయమూర్తి తొలగింపునకు తీర్మానం ప్రతిపాదించాలి. ఇది ఆమోదం పొందాక ఆరోపణలపై విచారణకు కమిటీ ఏర్పాటు చేయాలి. తనను సమర్థించుకునేందుకు లేదా తన తరఫున న్యాయవాదిని నియమించుకునేందుకు సంబంధిత న్యాయమూర్తికి హక్కు ఉంటుంది. ఆ అవకాశాన్ని ఆయనకు కల్పించాలి. అవసరమైతే పార్లమెంట్ ఎదుటా తన వాదన వినిపించు వచ్చు. ఆరోపణలు రుజువైతే తొలగింపునకు ఇదే ప్ర్రక్రియ వర్తిస్తుంది. 217వ అధికరణం న్యాయమూర్తుల తొలగింపునకు రాష్ట్రపతి అధికారం కల్పిస్తుంది. పదవికి భద్రత ఉన్నట్లయితే న్యాయమూర్తులు నిష్పక్షపాతంగా, నిర్భయంగా, ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేస్తారన్న ఉద్దేశంతో రాజ్యాంగ నిర్మాతలు న్యాయమూర్తుల తొలగింపునకు సుదీర్ఘమైన, అత్యంత క్లిష్టమైన ప్రక్రియను నిర్దేశించారు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved