22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

జస్టిస్రామస్వామి ఉదంతంలో ఏం జరిగింది?

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.రామస్వామి పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలోఆయన ఫర్నిచర్ కొనుగోలులో అక్రమాలకు పాల్పడాడరన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు.

1993లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు తొలిసారిగా ఒక సిట్టింగ్ జడ్జిని తొలగించవలసిన పరిస్థితి ఎదురైంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.రామస్వామి పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఆయన ఫర్నిచర్ కొనుగోలులో అక్రమాలకు పాల్పడాడరన్న ఆరోపణ వెలుగులోకి వచ్చింది. విషయం పార్లమెంట్ వరకు వచ్చింది. కానీ నాటి పీవీ ప్రభుత్వం ఆయనకు అండగా నిలిచి 1993 మే 11న పార్లమెంట్ లో తీర్మానం వీగిపోయేలా వ్యవహరించి అప్రతిష్టను మూట కట్టుకుంది. చివరి నిమిషంలో అధికార పార్టీ సభ్యులు సభకు గైర్హాజరవడంతో తీర్మానం వీగిపోయింది. అవినీతి ఆరోపణలు రుజువైనప్పటికి రాజకీయ నిర్ణయం జరగకపోతే న్యాయమూర్తితొలగింపు సాధ్యం కాదని ఈ ఉదంతం రుజువుచేసింది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved