17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

న్యాయవస్థపై నీలినీడలు

సౌమిత్రాసేన్ న్యాయమూర్తి కాకముందే ఈ అరోపణలు వచ్చాయి. న్యాయవాదిగా నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తికి అత్యున్నతమైన హైకోర్టు న్యాయమూర్తి పదవికి ఎలా ఎంపిక అయ్యిరన్న ప్రశ్న సహజంగానే ఇక్కడ ఉత్పన్నమవుతుంది. దీనికి సరైన సమాధానం లేదు. ఒక సాధారణ ఉద్యోగి నియామకానికి వర్తించే నియమ నిబంధనలు న్యాయమూర్తి ఎంపికలో ఎందుకు అనుసరించలేదో అర్థం కాదు. న్యాయమూర్తి ఎంపికలో సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, గవర్నర్, ముఖ్యమంత్రి, సుప్రీంకోర్టు ప్రమేయం ఉంటుంది. ఏ దశలోనూ ఎవరూ సేన్ గత ప్రవర్తన పరిగణనలోకి తీసుకోలేదన్న విషయం స్పష్టమవుతుంది. ఉద్దేశపూర్వకంగానే ఈ విషయాన్ని విస్మరించారన్నా వాదనా వినపడుతుంది.గతంలో జస్టిస్ రామస్వామి పై కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే, రామస్వామి, సౌమిత్రాసేన్ ఉదంతాల మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది. రామస్వామి న్యాయమూర్తిగా ఉంటున్న సమయంలో ఆరోపణలు రాగా సౌమిత్రాసేన్ న్యాయమూర్తి కాకముందే ఈ అరోపణలు వచ్చాయి.

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు ప్ర్రక్రియ ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో క్లిష్టతరమైనది. సుదీర్ఘమైనది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు నిర్దిష్ట మైన కాలపరిమితి లేదు.రాజకీయ నాయకత్వం నిర్ణయం తీసుకోకపోతే ఇక అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియను సరళం చేసేందుకు అనివార్యంగా రాజ్యాంగాన్ని సవరించాల్సిన ఆవశ్యకత ఉంది.

ప్రస్తుతం సేన్ విషయంలో కూడా ప్రధాన న్యాయమూర్తి సిఫారసుకు దీటుగా కేంద్రంస్పందిస్తేనే ఆయనను తొలగిచడం సాధ్యమవుతుంది. వచ్చేనెల(అక్టోబరు) 17 నుంచి జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ అంశం చర్చకు వస్తుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి హంసరాజ్ భరద్వాజ్ నమ్మకంగా చెబుతున్నప్పటికి అది సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే శీతాకాల సమావేశాలు జరిగేది కొద్దిరోజులే. చర్చించ వలసిన అంశాలు చేంతాడులా ఎన్నో ఉన్నాయి. ఇంత తక్కువ వ్యవధిలో న్యాయమూర్తి అంశం చర్చకు రావడం...నిర్ణయం తీసుకోడం కష్టమే. న్యాయమూర్తిని తొలగించాలన్న నిర్ణయం తీసుకున్నప్పటికి అందుకు అనుసరించాల్సిన విధివిధానాలు, ప్రక్రియ అంత త్వరగా పూర్తకావు. అందువల్ల ఈ విషయం ఒక కొలిక్కి రావాలంటే ఎన్నికలు జరిగి కొత్తప్రభుత్వం పగ్గాలు చేపట్టేవరు వేచిచూడాల్సిందే. అప్పటి ప్రభుత్వ ప్రాధాన్యాలు, విధానాల మేరకు ఈ అంశం మళ్లీ తెరపైకి వస్తుంది.

పేజి   12 |      

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved