17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

న్యాయవస్థపై నీలినీడలు

By జి, శివ కుమార్

శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు తమ అంచనాలు, ఆకాంక్షల మేరకు పనిచేయడంలో పూర్తిగా విఫలమైన నేపథ్యంలో పౌరులు అంతిమంగా నమ్మకం పెట్టుకున్న న్యాయవ్యవస్థకు సంబంధించి ఒక్కొటొక్కటిగా వెలుగుచూస్తున్న అవినీతి సంఘటనలు ఉస్సూరమనిపిస్తున్నాయి.
శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు తమ అంచనాలు, ఆకాంక్షల మేరకు పనిచేయడంలో పూర్తిగా విఫలమైన నేపథ్యంలో పౌరులు అంతిమంగా నమ్మకం పెట్టుకున్న న్యాయవ్యవస్థకు సంబంధించి ఒక్కొటొక్కటిగా వెలుగుచూస్తున్న అవినీతి సంఘటనలు ఉస్సూరమనిపిస్తున్నాయి.

ఉన్నత న్యాయవ్యవస్థలో గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు విస్తుగొల్పే విధంగా ఉన్నాయి. ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఒకటైన న్యాయవ్యవస్థ విశ్వసనీయతపై నిలువెత్తున నీలినీడలు కమ్ముకుంటున్నట్లు తాజా ఉదంతాలు స్పష్టంగా చాటుతున్నాయి. కోల్‌కత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌమిత్రాసేన్‌ను తొలగించాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ కేంద్రానికి లేఖ రాయడం, ఉత్తరప్రదేశ్ ‌లోని ఘజియాబాద్‌లో వెలుగుచూసిన పీఎఫ్ కుంభకోణంలో కిందిస్థాయి న్యాయమూర్తులతోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి పాత్రపైసీబీఐ విచారణకు ఆదేశించడం, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వై.కె.సభర్వాల్‌పై వచ్చిన ఆరోపణలు నిస్సందేహంగా న్యాయవ్యవస్థ ప్రతిష్టకు కళంకం కలిగించేవే. అత్యున్నత న్యాయవ్యవస్థలో పరిస్థితి అంతా సవ్యంగా లేదనడానికి ఈ సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

న్యాయవ్యవస్థలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్ ఈ అపసవ్య పరిస్థితికి వ్యతిరేకంగా అలుపెరగకుండా పోరాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కొందరు న్యాయమూర్తులు ఆయన వ్యవహారశైలి పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినా, కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని హెచ్చరించినా శాంతిభూషణ్ వెనక్కి తగ్గకపోవడం విశేషం. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు తమ అంచనాలు, ఆకాంక్షల మేరకు పనిచేయడంలో పూర్తిగా విఫలమైన నేపథ్యంలో పౌరులు అంతిమంగా నమ్మకం పెట్టుకున్న న్యాయవ్యవస్థకు సంబంధించి ఒక్కొటొక్కటిగా వెలుగుచూస్తున్న సంఘటనలు ఉస్సూరమనిపిస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన జస్టిస్ సౌమిత్రాసేన్ ఉదంతం పరిస్థితి తీవ్రతను ప్రతిబింబిస్తోంది.

జరిగిందిదీ...

కోల్‌కత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచోస్తేన్న సౌమిత్రాసేన్90ల్లో న్యాయవాదిగా ఉన్నప్పుడు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వర్సెస్ షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కేసులో కోర్టు రిసీవరుగా నియమితులయ్యారు. ఈ కేసుకు సంబంధించి కోర్టులో జమచేయాల్సిన రూ.33,22,800లను ఆయన సొంత ఖాతాలో వేసుకుని స్వప్రయోజనాలకు దానిని మదుపుపెట్టారన్నది ఆరోపణ. తరవాత సేన్ వడ్డీతో సహా రూ.58 లక్షలు చెల్లించారు. ఇదంతా 2006 నాటి మాట. డబ్బు చెల్లించిన మాత్రాన చేసిన తప్పు సమసిపోదు. ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పునకు శిక్ష ఎవరికైనా తప్పదు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి సేన్ నేరాన్ని నిర్థారించారు. కోల్‌కత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన నివేదిక మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించిన త్రిసభ్య సంఘం నిధుల దుర్వినియోగం వాస్తవమేనని తేల్చింది. రాజీనామా చేయాలని లేదా స్వచ్ఛంద పదవీ విరమణ ద్వారా పదవి నుంచి తప్పుకోవాలన్న సూచనను సేన్ పెడచెవిన పెట్టారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ ఆయనను తొలగించాలంటూ కేంద్రానికి లేఖ రాశారు.

పేజి   1 |   2 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved