19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

అసలు విమోచన ఎప్పుడు?

ప్రత్యేక తెలంగాణా కోసం ఉద్యమం మళ్ళీ ఉపందుకోవడంతో ఇప్పుడు ప్రతివారు తెలంగాణాపై ప్రత్యేక శ్రధను కనబరుస్తునారు. ఈ నేపథ్యంలో నిజాం రాష్ట్ర విమోచన దినానికి మన రాష్ట్రంలో ఎట్టకేలకు ప్రత్యేక గుర్తింపు కనిపిస్తోంది.

దేశానికి ఆగస్టు 15 ఎలాంటిదో ఒకప్పటి హైదరాబాద్ సంస్థాన ప్రజలకు సెప్టెంబరు 17 అటువంటిది. 1948 సెప్టెంబరు 17న నిజాం సైన్యం భారత్‌కు లొంగిపోవడంతో నిజాంపాలిత ప్రాంతాలు భారత్‌ భాగమయ్యాయి. అది ఆనాటి హైదరబాద్ విమోచన కథ . భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అనంతరం నాటి హైదరాబాద్ సంస్థానంలో కన్నడ మట్లాడే గుల్బర్గా, రాయచూర్, బీదర్ ప్రాంతాలు కర్ణాటకలో విలీనమయ్యాయి. మరాఠీ మట్లాడే ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నాందేడ్, అహ్మద్నగర్, పర్భణి మహారాష్ట్రంలో విలీనమయ్యాయి. తెలుగు మాట్లాడే ప్రజలు ఆంధ్రప్రదేశ్లో విలీనమయ్యారు.కారణాలేమైననప్పటికి ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పాలకులు సెప్టెంబరు 17 ప్రాధాన్యాన్ని సరిగ్గా గుర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నది చేదునిజం.కర్ణాటక, మహారాష్ట్రులు, హైదరాబాద్ విమోచనోత్సవాన్ని అధికారికంగా సెప్టెంబరు 17న నిర్వహిస్తూ తమ రాష్టాల్లోని నాటి హైదరాబాద్ సంస్థానం ప్రజల మనోభావాలకు పట్టం కట్టాయి. వారిని గౌరవించాయి. అంతేకాకుండా సెప్టెంబరు 17ను సెలవుదినంగా కూడా ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఆ స్ఫూర్తిని అర్థం చేసుకోవడంలో పూర్తిగా విఫలమైంది.

నేడు పార్టీల ప్రేమ

అయిదు దశాబ్దాలుగా విమోచన దినోత్సవాన్ని విస్మరించిన ఆంధ్రప్రదేశ్లోని పార్టీలకు ఇప్పుడు ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఇందుకు కారణం వచ్చే ఏడాదిలో జరగనున్న ఎన్నికలు, ప్రత్యేక తెలంగాణ అంశం గత ఏడెనిమిదేళ్లుగా తెరపై ఉండటం. 119 సీట్లున్న తెలంగాణను ప్రస్తుతం ఎవరూ విస్మరించే పరిస్థితి లేదు. అందుకే ఈ కొత్త ప్రేమ. ఆ ఉద్దేంశంతోనే వారు వీరూ అనే తేడా లేకుండా కొత్తగా పురుడు పోసుకున్న ప్రజారాజ్యంతో సహా విమోచన దినోత్సవాన్ని ఈసారి అన్ని పార్టీలు పోటాపోటీగా నిర్వహించాయి. నాటి పోరాటంలో పాల్గొన్న యోధులను విశేషంగా సత్కరించాయి. వచ్చే ఏడాది నుంచి విమోచన దినోత్సవాన్ని అధికారంగా నిర్వహించాలని డిమాండు చేశాయి. అధికార కాంగ్రెస్, విపక్ష తెలుగుదేశం కూడా ఇదే బాణిని వినిపించక తప్పింది కాదు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved