17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

స్పీకర్ పై చెదిరిన విశ్వాసం

By , బాల గంగాధర్ తిలక్

అయిదు దశాబ్దాలకు పైగా చరిత్ర గల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మెట్టమొదటి సారిగా స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టబడింది. పార్టీలకు అతీతంగా సభను నడిపే గురుతర బాధ్యతు మోసే స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం ఎంతో దురదృష్టకర పరిణామం. ఈ పరిస్థితి పూర్వపరాలు

అయిదు దశాబ్దాలకు పైగా చరిత్ర గల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గతనెలలో అసాధారణ సంఘటనలు చోటుచేసుకున్నాయి. విపక్ష సభ్యుడి సస్పెన్షన్, స్పీకర్‌పై అవిశ్వాసానికి రెండు పార్టీలు నోటీసులివ్వటం వంటి అవాంఛనీయ సంఘటనలు పన్నెండో సభలో చోటుచేసుకోవడం అత్యంత దురదృష్టకరం. సభాపతి కె. సురేష్ రెడ్డిపై అవిశ్వాస్వాన్ని ప్రకటిస్తూ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, మరో విపక్షం తెలంగాణా రాష్ట్రసమితి, విడివిడిగా నోటీసులిచ్చాయి. సభాగౌరవాన్ని, మర్యాదను కాపాడటంలో స్పీకర్ విఫలమయ్యారంటూ తెలుగుదేశం, రాజ్యాంగం పదో షెడ్యూల్లోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులో విఫలమయ్యారని తెరాస తమ నోటీసుల్లో పెర్కొన్నాయి.

నియమ నిబంధనల ప్రకారం చూస్తే అవిశ్వాసానికి సంబంధించిన నోటీసుపై ప్రస్తుత సమామేశాల్లో చర్చకు అవకాశం లేదు. ఎందుకంటే నోటీసుచ్చిన 14రోజుల్లోగా దానిని ఎప్పుడైనా పరిశీలించాలి.సెప్టెంబరు 9కి నోటీసు ఇచ్చి 14రోజులు అవుతుంది. అయితే ఈనెల అరోతేదీతో సమావేశాలు ముగిసిన నేపథ్యంలో నోటీసును పరిశీలించేందుకు 15వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది.

గతంలో లేనివిధంగా

గతంలోనూ సభాపతులపై ఆరోపణలు రాకపోలేదు. ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా ఏదో ఒక సందర్భంలో ప్రతిఒక్కరూ ఎంతో కొంత వివాదాస్పదం కాక తప్పలేదు. అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, విపక్షాల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని, తమకు మాట్లాడే అవకాశం రాలేదంటూ నాటి స్పీకర్లు యనమల రామకృష్ణుడు, కె. ప్రతిభాభారతి, దుదుళ్ళ శ్రీపాదరావు, జి. నారాయణరావు వంటి ఉద్దండులపై ఆరోపణలు చ్చినప్పటికి వాటిని ఎవరూ అంత తీవ్రంగా తీసుకోలేదు. విపక్ష సభ్యులు కూడా ఆరోపణలతోనే సరిపుచ్చుకున్నారు తప్ప వ్యవహారాన్ని అవిశ్వాసం దాకా ఎప్పుడూ తీసుకురాలేదు. ఇప్పుడు ఏకంగా సభాపతిపై అవిశ్వాసానుకి నోటీసులు ఇచ్చాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో విదితమవుతుంది.

తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రకాశం జిల్లా అద్దంకి శాసనసభ్యుడు కరణం బలరామ కృష్ణమూర్తి జిల్లా కేంద్రమైన ఒంగోలులో జరిగిన ఒక కార్యక్రమాల్లో స్పీకర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరునెలలు సస్పెన్షన్‌ తదితర పరిణామాలా నేపథ్యంలో ఆగ్రహించిన తెలుగుదేశం అవిశ్వాసానికి నోటిసిచ్చింది. వాస్తవానికి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేంత బలం తెలుగుదేశానికి లేదు. తీర్మానం చర్చకు రావాలంటే కనీసం 50మంది సభ్యుల మద్దతు తప్పనిసరి. అంతబలం ఆపార్టీకి లేదు. అయితే మరో విపక్షం తెరాస తోడురావడంతో దాని పరిస్థితి తేలికయింది. రెండు పార్టీలకు కలసి 50మందికి పైగా సభ్యులున్నారు.

తమ పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విచారణను సభాపతి ఎంతకాలానికి తెమల్చకపోవడం తెరాసను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది.

పేజి   1 |   2 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved