17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

వినాయక మంగళహారతులు

జయ మంగళం నిత్య శుభ మంగళంశ్రీ శంభుతనయునకు సిద్ధిగణనాధునకు వాసిగల దేవతా వంద్యునకును

ఆ సరసవిద్యలకు ఆదిగురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును || జయ ||నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణు

వేరువేరుగ దెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నిపుడు || జయ ||సుస్థిరముగ భాద్రపద శుద్ధ చవితీ యందు పొసగ సజ్జనులచే పూజగొనుచు

శశి జూడరాదన్న జేకొంటి ఒక వ్రతము పర్వమున దేవ గణపతికి నిపుడు || జయ ||ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళమీదికి దండు పంపు

కమ్మని నేయియును కడు ముద్దపప్పును బొజ్జ విరుగగ దినుచు పొరలుకొనుచు || జయ ||పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరిని

ఎప్పుడు నినుగొల్తు ఏకచిత్తమున పర్వమున దేవ గణపతికి నిపుడు || జయ ||ఏకదంతంబును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు

జోకైన మూషికము పరుగు నెక్కాడుచును భవ్యుడగు దేవగణపతికి నిపుడు || జయ ||మంగళము మంగళము మార్తాండతేజునకు మంగళము సర్వజ్ఞవందితునకు

మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవగణపతికి నిపుడు || జయ ||జయ మంగళం నిత్య శుభ మంగళం

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved