22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

వినాయచవితి

అశేష తెలుగు ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే వినాయకచవితి పండుగ పూజా విధానం, వ్రత కథను మా పాఠకులకోసం అందిస్తున్నాం.వినాయచవితి వ్రత విధానం:మెదట సంప్రోక్షం తరువాత

శ్లో || శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |

ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ||అని వినాయకుని ప్రార్ధించి ఆచమనం చేయవలెను. ఆచమనం తరువాత భూతోచ్ఛాటనము చేయవలెను. తరువాత ప్రాణాయామము చేసి సంకల్పం చెప్పుకోవాలి. ఆ తరువాత క్రింది విధంగా ప్రార్థన చేయాలి.

శ్లో || భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ | విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే ||

ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం | పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్ ||

ఉత్తమం గణనాథస్యవ్రతం సంపత్కరం శుభం | భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం. ||

అటు పింమ్మట్ట కలశార్ఛన చేయవలెను. ఆ తరువాత షోడశోపచార పూజ కావింపవలెను. షోడశోపచార పూజ తరువాత అధాంగ పూజ చేయవలెను. ఆ స్వామిని అంగాగము పూజించిన పిమ్మట ఏకవింశతి పత్రి పూజ . స్వామికి మిక్కిలి ప్రియమైన పత్రి పూజానంతరం ఓ రెండు అరటి పండ్లు నివేదన చేయాలి. తరువాత పుష్పములతోను, అక్షతలతోను శ్రీ వినాయక అష్టోత్తర శతనామ పూజ చేయవలెను.ఈ పూజ ముగియగానే వినాయకునికి కొబ్బరికాయ కొట్టి --కొబ్బరి, అరటి పండ్లు, చలిమిడి, వడపప్పు, పానకం, ఉండ్రాళ్ళు నైవేద్యం చేయవలెను.శ్రీ వినాయక వ్రత కథ చదివి/ విని - తరువాత కథాక్షతలు కొన్ని దేవుని పాదములపై వేసి, మిగిలినవి మన తలపై వేసుకొనవలెను. మహానైవేద్యం(అన్నము, పాయసము,పులిహోర, కూరలు, పప్పు, పెరుగు, ఇంకా పిండివంటలు మరియు కుడుములు) అర్పించి మంగళహారతులు , విఘ్నేశ్వరుని పొగడుతు పద్యములను ఆలపించి వ్రతమును ముగించవలెను.... పూజాపత్రాలు


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved