19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

వై యస్ పది తలల రావణుడు

తెలుగుదేశం, కాంగ్రెస్ రెండూ అంతర్గత ప్రజాస్యామ్యం లేని పార్టీలని, వాటివల్ల తెలంగాణ సాధ్యం కాదని దేవేందర్ అన్నారు. వైయస్స్ , చంద్రబాబు రాహు కేతువుల లాగా తెలంగాణా అభివృద్ధికి అడ్డు పడుతున్నారని అన్నారు. తెలుగుదేశం-చంద్రబాబు దశ గమ్యం తెలియని నావ అని ఆయన అభివర్ణించారు. తెలంగాణాకు ముఖ్య శతృవు వైయస్ సర్కారేని అన్నారు. వైయస్ ను పది తలల రావణునితో పోలుస్తు, శ్రీరాముడు ధర్మసంస్థాపన చేసిన విధంగా తెలంగాణా ప్రజలు తగిన బుద్ధి చెపుతారన్నారు. తెలంగాణా ఐకమత్యాన్ని తక్కువ అంచనా వేయవద్దని హితవు చెప్పారు. ఈ తెలంగాణా ఆత్మ గౌరవ పోరులో తుది విజయం తెలంగాణా ప్రజలదేనని అన్నారు. అన్నివిషయాలలో అభివృధిని సాధించామని, ఇక చేయటానికి ఏమి లేదని బీరాలు పోతున్న వైయస్ అలసిపోయారని, ఇక విశ్రాంతి తీసుకోవటం మంచిదని దేవేందర్ ఎద్దేవా చేశారు. తమ అభివృద్ధిని తామే చేసుకుంటామన్నారు. తెలంగాణ ప్రజలు కట్టపెట్టిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఒక విష వృక్షమని, దానిని కూకటి వేళ్ళతో పెకిలించివేస్తామని, వైయస్స్ చివరి ముఖ్యమంత్రి అని, ఆ తరువాత కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని అన్నారు. చిరంజీవి తిరుపతిలో ప్రజారాజ్యం ఆవిర్భావ సభలో తెలంగాణాది అత్మగౌరవ సమస్యగా గుర్తించటం హర్షనియ్యం అని తెలిపారు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved