17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

చిరు పార్టీ పేరు ప్రజారాజ్యం

"సమస్యలే మన శతృవులు. మనం ప్రజా సమస్యలపై యుద్ధం చేయబోతున్నాం. ఇందులో నాయకులు లేరు. అందరూ సైనికులే. మనకు ఎదురు వుండదు. దానికి కారణం మనకు స్వార్థం, భయం లేదు. మనది దీక్షను నింపుకున్న మహిళా, యువత శక్తి. కుల వృత్తులవారు, పారిశ్రామికవేత్తలు, మేథావులు ఇలా అందరూ మనతో చేయికలుపుతారు. ఒక్కొక్కరం ఒక్కో ఇటుక పేర్చి స్వప్న సౌధం నిర్మ్ద్దిద్దాం. ప్రతివొక్కరి కళ్ళలో ఆనందం కోసం కృషి చేద్దాం.... " - చిరు

సినిమాలలో ఎన్నో పాత్రలు పోషించిన చిరు తన రాజకీయ ప్రవేశిం గురించి మాట్లాడుతూ ఇది ప్రజలు రాశిన కొత్త పాత్ర అని, ఇందులో నటించటం కాదు, జీవించాలి. ఇక ఈ పాత్రలోనే జీవిస్తా. ఇది జీవిత కాలం పాత్ర అని అన్నారు. ఇక ప్రజల కోసమే కష్టపడతానని ప్రమాణం చేశారు.

పార్టీ పేరును ప్రకటిస్తూ తమ పార్టీ ప్రజల కోరిక మేరకు పుట్టినపార్టీ,ప్రజలకు స్వంత పాలనను అందించే పార్టీ అనీ అందుకే ప్రజారాజ్యం అని పేరు నిర్ణయించామని ప్రకటించారు.

పార్టీ జెండాను ఆయన వికలాంగుల చేతుల మీదుగా ఆవిష్కరింప చేశారు. మూడొంతులు తెలుపు, ఒక వంతు ఆకు పచ్చరంగులతో ఉన్న ఈ జెండా తెల్లని భాగంలో ఎర్రని సూర్యుడు. ఆ సూర్యుని బింబానికి చుట్టూ పసుపు పచ్చని వలయం. సూర్యునికి 24 కిరణాలు. ఆకుపచ్చ సస్యశ్యామలానికి, రైతులకు, పాడిపంటలకు గుర్తు అని, ఎరుపు విప్లవానికి, మార్పుకు గుర్తు అని, తెలుపు స్వచ్చతకు అందరిని కలుపుకుని పనిచేయటానికి చిహ్నంగా, సూర్యుని చుట్టు ఉన్న పసుపు వలయం చిరునవ్వులకు ప్రతీక అని చిరంజీవి అభివర్ణించారు. అలాగే అన్ని మతాలకు, ఎరుపు హిందువలకు, తెలుపు క్రైస్తవులకు, ఆకుపచ్చ ఇస్లాంకు గుర్తుగా, జెండా సమైక్యతను తెలుపుతుందని అన్నారు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved