22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ఆకట్టుకున్న చిరు ప్రసంగం - విషయాలు

విధి విధానాలు గురించి:

పార్టీ విధి విధానాలు నేను ఒక్కడినే నిర్ణయించను. అయితే నా దృష్టినుండి కొన్ని విషయాలను స్థూలంగా చెపుతాను.వ్యవసాయం, నీటిపారుదల: రైతాంగానికి అగ్ర స్థానం. రైతుల సమస్యలను పరిష్కరించ టానికి ప్రాధన్యం. భారీ వ్యయంతో నిర్మించే భారీ నీటి పారుదల ప్రాజెక్టులకంటే, ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించే విధంగా, చెరువులు, కుంటలను అభివృద్ధి పరచాలి. భారీ ప్రాజెక్టులలో అవినీతిని అరికట్టాలి.విద్య: ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య అందని ద్రాక్ష అయిపోయింది. బాలకార్మికులుగా మారిపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకు పోటీ పడేలాగా పరిస్థితిని మార్చాలి.

ఆరోగ్యం: ప్రతి గ్రామంలోను కనీస మందులు, డాక్టర్లు అందుబాటులోకి తెస్తాం. జిల్లా స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ ఆసుపత్రుల తరహా వసతులు కల్పిస్తాం.

మధ్యరగతికి సాయం: నిత్యం కొట్టుమిట్టాడుతున్న జాతి. అటు రెండు రూపాయల బియ్యం పొందలేక, పాతిక రూపాయల బియ్యం కొనలేక బాధ పడుతూ, పైకి ఎదగలేక, మెట్టుదిగలేక రోజులు వెళ్ళదీస్తున్న మధ్యతరగతి ప్రజలకు చేయూత.కార్మిక వర్గం, వుద్యోగులు: అసంఘటిత, సంఘటిత కార్మికులందరూ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారికి చేయూత. అలాగే జీతాలకి జీవితాలకు పొంతన లేకుండా అవస్తలు పడుతున్న ఎన్జీవోలు, క్లాస్ ఫోర్ వుద్యోగుల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాంమహిళలు: ఆకాశంలో సగం, భూమాతా అంటూ పొగుడుతున్నా, మహిళల స్థితి బాగాలేదు. వారిని మహా శక్తిగా నిరూపిస్తాం. రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములను చేస్తాం.అవినీతి: వ్యవస్థీకృత అవినీతిని, ముఖ్యంగా రాజకీయ అవినీతిని ప్రక్షాళన చేయాలి. అవినీతి కారణాలైన ఆకలి, అవసరం, అత్యాసలపై తగిన చర్య తీసుకోవాలి.

మద్యం: మద్యపానంపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి అరికట్టడానికి నిర్ణయం.నక్సలిజం: రోగం ఒక చోట, మందు ఒక చోటాగా వున్న నేటి విధానం తగదు. నక్సలిజం ఒక సామాజిక సమస్య. కేవలం శాంతి బధ్రతల సమస్యకాదు. పోలీసుల సమస్యలపై దృష్టి సారించి వారికి సరైన అవకాశాలు కల్పిస్తాం. పోలీసు వ్యవస్థ ఆధునీకరణకు తోట్పాటు.తెలంగాణా: నేను ఒక్కడిని నిర్ణయం తీసుకోలేను. తెలంగాణా సమస్య ఆత్మగౌరవ సమస్య. తెలంగాణా- కోటి రతనాల సీమ కోటి సమస్యల సీమగా మరింది. వెనుకబాటు తనం వుంది. ఎంతో చరిత్ర, సంసృతి కలిగిన తెలంగాణాకు నీరు, నియామకాలలో అన్యాయం జరిగింది. ఇది ఇప్పటివరకు ఉన్న నాయకుల వలనే. కోస్తా రాయలసీమలలో కూడా వెనకబాటు తనం వుంది. మేము సెంటిమెంటును గౌరవిస్తాం.శాస్త్రీయంగా అధ్యయనం చేస్తాం. విడిపోవటం అనివార్యమైతే సామరస్యంగా విడిపోవడానికి సహకరిస్తాం.భూ విధానం: రైతల భూమలను లాక్కొని SEZలకు ధారపోయటం అన్యాయం. వ్యవసాయానికి అనువుకాని భూములను పరిశ్రమలకు అందిస్తాం. ప్రభుత్వం భూములను అమ్మటానికి వ్యతిరేకం.గ్రామ స్వరాజ్యం: బాపూజి కలలు గన్న గ్రామ స్వరాజ్యం కోసం కృషి. పట్టణాలకు వలసలతో గ్రామాలు జీవం కోల్పోతున్నాయి. పల్లేవాసులకు నాణ్యమైన జీవితం ఇవ్వాలి. Local Governanceను పెంపొందించాలి. నిధులను బదాలయించి, బాధ్యతలను అప్పగించి పాలనను గ్రామ స్థాయిలోకి తీసుకువెళతాం.ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు: OCలు, అగ్రవర్ణాలలో కూడా ఆర్థికంగా వెనుకబడిన వారు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లకు తోడుగా EBCలను గుర్తించి వారికి అవకాశాలను కల్పిస్తాం.

పేజి   12 |      

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved