22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

చేయెత్తి జై కొట్టు తెలుగోడా

చేయెత్తి జై కొట్టు తెలుగోడా

గతమెంతొ ఘన కీర్తి కలవాడాసాటి లేనీ జాతి

ఓటమెరుగని కోట

నివురుగప్పీ నేడు

నిదురపోతుండాది

జేకొట్టి మేల్కొలుపు తెలుగోడా

గతమెంతొ ఘన కీర్తి కలవాడావీర రక్తపు ధార

నార పోసిన సీమ

పలనాడు నీదెరా

బాల చంద్రుడు చూడ

ఎవరోయ్

తాండ్రపాపయ కూడనీవోడూనాయకీ నాగమ్మ

మల్లమాంబ మొల్ల

మగువ మాంచాల నీ

తోడబుట్టిన వాళ్ళె

వీర వనితల గన్న తల్లిరా

ధీరమాతల జన్మభూమిరాగతములో నీ కీర్తి

కతలల్లి సెప్పారు

పసయేడ దాచావు

వుసిలేక పోయెరా

బ్రతుకె బరువైయుంటివీనాడు

శతపోరి సాధించు తొలిపేరునాగార్జునుని కొంద

ఆమరావతీ స్థూప

భావాల పుట్టలో

జీవకళ పొదిగావు

అల్పుడవు కానంచు తెల్పావు

శిల్పివంటిరి దేశ దేశాలురాజ్యమంటే వీర

భోజ్యమన్నాడు, మన

తిక్కనార్యుని మాట

ధీరులకు బాటరా

పూర్వ పౌరుషమెరిగి బ్రతకాలి

కార్యశూరులు

నేడు కావాలోయ్దేశమంటే వట్టి

మట్టి కాదన్నాడు

మనుషులన్నా మాట

మరవబోకన్నాదు

అమరకవి గురజాడ నీవోడూ

ప్రజల కవితను

బాడి చూపేడోయ్రాయలేలిన సీమ

రతనాల సీమరా

దాయగట్టి పరులు

ధారతీస్తుండారు

నోరెత్తి అడుగరా దానోడా

వారసుడ నీవెరా తెలుగోడ

-వేములపల్లి శ్రీ కృష్ణ


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved