22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ఆంధ్రం

తెలంగాణసీమ

కోస్త రాయల సీమ

యావదాంధ్రుల సీమ

ఓ అమ్ములన్నకృష్ణ రాయల సీమ

కాకతీయుల సీమ

సామ్రాజ్యాంధ్ర సీమ

ఓ అమ్ములన్నవెంకన్న కొలువున్న

రామన్న కొలువున్న

వైష్ణవ దేశమన్న

ఓ అమ్ములన్నమల్లన్న రాజన్న

భీమన్న కొలువున్న

త్రిలింగ దేశమన్న

ఓ అమ్ములన్నవరంగల్ కాళమ్మ

బెజవాడ దుర్గమ్మ

వెలసిన దేశమన్న

ఓ అమ్ములన్నపంచారామ సీమ

పచ్చని కోనసీమ

ధాన్యాగారా సీమ

ఓ అమ్ములన్నవీర పల్నాటి కథ

ఆంధ్ర భారత గాథ

తెలుగు పౌరుష గాధ

ఓ అమ్ములన్నసమత పెంచిన సీమ

సాహసము గల సీమ

బ్రహ్మన్న ఘనసీమ

ఓ అమ్ములన్నకృష్ణ పారే సీమ

గౌతమి పారు సీమ

పావన తెలుగు సీమ

ఓ అమ్ములన్నమల్లమ్మ పతి భక్తి

నాగమ్మ రణ యుక్తి

మొల్లమ్మ కవితోక్తి

ఓ అమ్ములన్నశ్రీ శ్రీ కన్న  సీమ

జాషువా కవి సీమ

నవ సాహిత్య సీమ

ఓ అమ్ములన్నకందూరి దేశము

గురజాడ స్వదేశము

ప్రగతి శీల దేశము

ఓ అమ్ములన్నకేసరి కన్న సీమ

అల్లూరి ఘనసీమ

సాహస తెలుగు సీమ

ఓ అమ్ములన్నలలిత కళా దేశము

తేనెపలుకు దేశము

నా తెలుంగు దేశము

ఓ అమ్ములన్నశాతవాహన విభులు

ప్రథమాంధ్ర భూపతులు

ధరణి కోట ప్రభువులు

ఓ అమ్ములన్నచోళపల్లవ సీమ

చాళుక్యఘనసీమ

నవాబులేలు సీమ

ఓ అమ్ములన్నతల్లి కోట సమరము

విజయ నగరపతనము

తెలుగు శిరమ వనము

ఓ అమ్ములన్నఅరవగోల పడకనె

చెన్నపురి వదలుకొనె

స్వరాష్ణ్రము తెచ్చుకొనె

ఓ అమ్ములన్నమా వాళ్ళు కర్నూలు

ముఖ్యపట్టణ మేలు

ఆంధ్రులకు జేజేలు

ఓ అమ్ములన్నహైద్రాబాదు నగరము

ఆంధ్ర ముఖ్య నగరము

పలుసంస్కృతుల పురము

ఓ అమ్ములన్న


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved