19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ఆంధ్రౌన్నత్యం

ఆంధ్రదేశముఎక్కడ చూచినన్ వరసు లెక్కడ చూచిన దేవమందిరం

బెక్కడ చూచినన్ వనములెక్కడ చూచిన పైరు పచ్చలే

ఎక్కడ చూచినన్ తటిను లెక్కడ చూచిన పుష్ప వాటికల్

చక్కని ఆంధ్రదేశము ప్రశస్త ప్రకాశము నెన్న శక్యమేఆంధ్ర నదులు:ప్రవహించు నెచ్చోట పరమపావనియైన గౌతమీ గంగమ్మ కడలి కొమ్మ

ప్రవహించు నెచ్చోట పరమపావనియైన తుంగ గంగాభద్ర తుంగభద్ర

ప్రవహించు నెచ్చోట పరమపావనియైన హేరాళజలపాణి కృష్ణవేణి

ప్రవహించు నెచ్చోట పరమపావనియైన మన్నుపొన్నొనరించుమిన్నపెన్నఆ త్రిలింగ భూభాగమం దాంధ్రుడవుగ

జన్మ మొందుట యెన్నెన్ని జన్మముల ము

కృతఫలంబో యెంచుకొను మోయీ రవంత

అమల గుణ ధీర ఓ ఆంధ్రవీరఆంద్ర దేవతలువారణాసిని వీడి వ్యాసుడు కాల్నడ ఏతెంచి కన్న భీమేశ్వరుండు

శ్రీ కాళ హస్తుల సాకల్యకైవల్య మిడి ప్రోచినట్టి కాలేశ్వరుండు

తిలకించినంతనే మలి జన్మ లేకుండ ఆదుకొనెడు మల్లికార్జునుండు

ఆసేతు హిమశైలమందలి జనముల కేక దేవుడు వెంకటేశ్వరుండునాల్గుదిక్కుల నిన్ను ఆహరహంబు

కంటిని రెప్పపోలిక కాచుచుండ

ఆన్ని విధముల నభివృద్ది నంది నీవు

దేశమును తీర్చిదిద్దుమా తెలుగు తండ్రిశ్రీ పెన్మెత్స సత్యనారాయణ రాజు

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved