22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

తెలుగు భాష తియ్యదనం - కమనీయ తెలుగు పదం

దేశ భాషలందు తెలుగు లెస్స - పద్య శిల్పం ఛందశ్శిల్పం

తెలుగు భాష తియ్యదనం అతి మధురం

రచనా రమణీయత కొకటి- రసభావ వ్యక్తీ కరణ కొకటి

సాకారాలు సర్వ శోభ ప్రతీకలు

ఆది కవి నన్నయ సృష్టి - ప్రబంధ సాహిత్య వృష్టి

తెలుగు అక్షరాల సరాగ స్రష్ట

తిక్కన తెరువులు నేర్పులు తెలియని తెలుగు వారలెవ్వరు?

కావ్యేతి హాస ప్రక్రియా ప్రస్ధానం రాజ మార్గమై మహారధి తిక్కన కాగా

తెలుగు గడ్డ పారిన పల్పు బంగరు గని కాదె?

చమత్కార పధం నుండి రీతి ప్రస్ధాన దిశకు మళ్ళింపు

శ్రీనాధుని శబ్దంచేత ఆకృతి శిల్పం ఏ భాషకున్నదీ ప్రక్రియ కెంపు?

జాతి వార్తా చమత్కారాలు! స్వభావోక్తి జాత్యలంకారాలు!

తెలుగు పద మణి మకుటాలు! తెలుగు జాతికి గర్వ కారణాలు!

తెలుగు జానపద గేయాలు! పల్లె ప్రజల పుగ ప్రజల ప్రాణాలు!

ఎల్లలెరుగని పద ఎల్లోరాలు! వల్లె వేయనిది వదలని పద పరిమళాలు!

సాంప్రదాయ నాటకాలు! సాంఘీక సమస్యా నాటకాలు!

వరదలై పారే పారిజాతాలు! తెలుగు వెలుగుల సౌరభాలు!

విషాద గంభీర రూపకాలు! విషాదాంత నాటకాలు!

"సారంగధర" సాక్షిగా విశ్వనాధ వారి "నర్తనశాల"

గంభీర తెలుగు కలం నుండి జాలువారినవే!

గిరజాడ "కన్యాశుల్కం "- వెంకట శాస్త్రి "ప్రతాప రుద్రీయం"

తెలుగు పద శక్తి కానవాళ్ళు - కదలి కదిలించే తెలుగు కధానికలు

సంప్రదాయ నియచాల తలమానికం!

చారిత్రక కావ్యాలంకరణ నవలాదేశం

తెలుగు బిడ్డ ఒడిన కితాబులే కదా!

అనాది కవులేమి అభ్యుదయ కవులేమి - తెలుగు నుడి కారాన్ని రంగరించి

పలుకుల పద్మ రాగాల నొలికించి - వేనోళ్ళ పరికించి పరవశించి

దేశ భాషలందు తెలుగు లెస్సని - రాయల చెత పొగడయడెనె!

తిరుపతి వేంకట కవుల - శిష్య పద్మ రాగము బ్రౌను దొర

ఆంగ్ల గడ్డయందాక తెలుగు అచ్చు యంత్రం - చేర్చి కూర్చి -

తెలుగు యాంగ్ల నిఘంటువు

విరచించి తెలుగు కెంత సేవ ఓ ఆంగ్లేయుడు?

ఆధునిక తాత్విక కావ్యాలను - ఆవిర్భావ వికాసాలను

గుబాళింప జేసిన - సందర్శనం

నుడివిన వ్యంగ్య పల్కులు భావ సంద్రం -

తెలుగు పల్కుల సజీవ నదీ ప్రవాహం

ఎన్ని జన్మలు! పూవులో నెన్ని రేకులు? ఎన్ని వాసనలు? హృదయములోనే

ఎన్నో యుగము లొదిగి యున్నవి - ఒక పాము తన తోకను తానే

మ్రింగబోవు చున్నట్లున్నది.

ఆదినుండి వికాస యుగం సంక్రమణ వరకు -

కావ్యాలను శీలన యుగం నుండి

శిల్పాను శీలన యుగం వరకు - సమన్వయ యుగం మొదలు

సమీక్షాయుగం నేడు సాగుచుండ - ఎందరెందరో కవి పుంగవులు

రచనా మాధురీ ఝరులను - తెలుగున కూర్చి ధన్యులైరి

తెలుగు పద యుగళం గళం విప్పిన వేళ - కలువ వచ్చిన సర్వజనులారా

కవి శ్రేష్టులారా తెలుగు రధ సారధులార - పుణ్య చరితం తెలుగు జన్మ!మా తెలుగు తల్లికి జై - భరతమాతకు జై

- శికకొల్లు లక్ష్మీ మోహన్


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved