22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ఆకాంక్ష

తెలుగు రాష్త్రమ్ము సాధించి యమరుడైన

పొట్టి రాముని గన్న పుణ్య భూమి

ధీరుడౌ ఆంధ్ర కేసరి టంగుటూరిచే

పాలింపబడినట్టి పసిడి భూమి

సఖ్య దాయక మౌచు సౌఖ్య నిలయ మౌచు

రమ్యమై నిలనలనారు భూమి

జీవ నదులు పారి సిరిసంపదలు నిండి

అన్నపూర్ణకు నుద్దియైన భూమితే|| గీ || వీరులిచ్చట జనియించు వారలంచు

త్యాగధనులంచు, నిష్కామ యోగులంచు

ఘనత చెందు వారలదె ఈ తెలుగు నేల

నిందు పుట్టుట భాగ్యమ్ము నెవరికైనతే|| గీ || అరమరికలన్నవే లేకనందరుడి

శాంతి సౌభాగ్యములు నిట చాల నిండి

తెలుగు భాషయు సంస్కృతి తేజరిల్ల

వెలుగ వలె ఆంధ్ర విభవము విశ్వమందు!---సాహిత్య రత్న డా|| మంగళగిరి ప్రమీలాదేవి.

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved