17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

స్త్రీ సాధికారత

By , బామ్మగారు

మా చెల్లెలి భర్త ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. ఆ కారణంగా వాళ్లను పిలిచి నాలుగు రోజులు ఉంచుకుని బట్టలు పెట్టి పంపాలని నా తలంపు. తలచినదే తడవుగా మా ఆయనగారి చేత ఫోనులో వారిని రావలిసిందిగా పిలిపించాను.

మా చెల్లెలి భర్త చాలా మంచివాడు. కాకపోతే ఆయనకు బుస్సున కోపం వస్తుంది. తుస్సున చల్లారిపోతుంది. అవీ - ఇవీ రాస్తుంటానని నా యందు మాత్రం ఆయనకు గౌరవభావన ఉంది. అందుకే పిలవగానే ఇద్దరూ వచ్చారు. వాళ్ళ రాకతో, మా ఇల్లు సందడితోనూ, మా మనసులు సంతోషానందాలతోనూ నిండిపోయాయి.

మా కొడుకు కోడలు ఆఫీసులకు, పిల్లలు స్కూళ్ళకు వెళ్ళారు. వాళ్ళనలా పంపి మేము నిదానంగా టిఫెన్లు తిని, కాఫీ తాగుతూ మాటల్లో పడ్డాము. ఆ మాటల్లో స్త్రీల ఎదుగుదల మీద మాటలు దొర్లాయి.

స్త్రీ సాధికారత ,స్వావలంబన పదాలను ఈ మధ్య ఎక్కువగా వింటున్నాను. పత్రికలో చదువుతున్నాను. నేను కూడా ఏమిటీ సాధికారత అంటే ? ఏమిటీ స్వావలంబన అంటే? అని ఆరా తీయగా ఒక విధంగా స్వయం నిర్ణయాధికారంగా చెప్పుకోవచ్చని తెలిసింది. ఓస్ ఇదేనా! మా కాలంలో ఐతే స్త్రీస్వేచ్ఛపురుషునితో సమాన హక్కులు అనేవారము. ఇప్పుడు మనకిఅవి వచ్చేశాయ్ కదా! అందుకేఅవి ఇలా మారాయనుకున్నాను.

"స్తీలకు ఎప్పుడు లేవండీ సమాన హక్కులు చెప్పండి...నేను పుట్టి బుద్ధెరిగిన గాణ్ణించి , స్త్రీలకు స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు సమానహక్కులు అన్నీ ఉన్నాయ్. ఉండటంగాదు బాగాబానే... ఉన్నాయ్ " అన్నారు మాచెల్లలి భర్త.

మా చెల్లలు, ఆయన మాటకు అడ్డుపడుతూ , "అంటే యా..భై...ఎనిమిది సంవత్సరాల క్రితం నుండి ఆడవాళ్ళకు హక్కులున్నాయ్ . స్వాతంత్ర్యం బానే ఉందన్నమాట" అంది వ్యంగ్యగా.

"ఊరుకోవే" అన్నాను. ఆయనకెక్కడ బుస్సున కోపం వస్తుందోనని. మా చెల్లెలుఈయనగారి కోపమెంత!? అన్నట్లు నటనతో చూపించి నాలిక చప్పరించింది.

మా చెల్లలి భర్త ఆయన ధోరణీలోనే ముందుకు కొనసాగిస్తూ " మా ఇంట్లో ఎప్పుడూ మా అమ్మ పెత్తనమే ఉండేది. మా తాతయ్య చచ్చేవరకు మా బామ్మమాటకు విలువిస్తూనే వచ్చాడు. ఎనభై ఏళ్ళు మా బావగారికి. ఇప్పటికీ ఇంకా మా అక్క గీసిన గీటు దాటడు. ఏ..మి..టండీ...ఇం....కా... ఈ ఆడవాళ్ళ గోల. సాధికారతట సాధికారత. ఇంటా బయటా వాళ్ళగోలేనాయే. మన గోడు వినే నాథుడే లేడు. మనం..మనం..ఏడ్వాల్సిన రోజులండి యివి." ముఖం కందగడ్డలా చేసుకొని అన్నాడు మా చెల్లెలి భర్త.

ఆ మాటలకు మా అయనగారి ముఖం కుడా ఒక వెలుగు వెలిగింది. అయినా సర్దుకొని పైకి మాత్రం "మీ మాటల్లోనూ నిజముందనుకోండి. అయినా ఆడవారికి ఆర్ధిక స్వావలంబన అవసరమే లెండి " అన్నారు మా ఆయనగారు.

"ఆర్ధిక స్వాధికారత అయిపోయిందండి.యిహరాజకీయ స్వాధికారత ట. దీని కోసం మరి ఉద్యమాలే చేస్తారో ,ఆందోళనలే చేస్తారో చూడాలి " అన్నాడు మాచెల్లెలి మొగుడు.

"తప్పేముంది లెండి. జనాభా లో సగంవారు కూడా అయినప్పుడు, వారి సేవలు మనమూ పొందుతున్నప్పుడు ...", మా ఆయన మాట పూర్తి కాకుండానే మా చెల్లెలి భర్త ఆవేశంతో "తప్పేముందా...??అఁహఁ తప్పేముందా...? ఏం మాట్లాడుతున్నారు? అసలేం మాట్లాడుతున్నారండి?? స్త్రీస్వేచ్ఛ, సమాన హక్కులు, స్వాతంత్ర్యము అంటూ అప్పుడు చావ గొట్టారు. రాజకీయ అధికారాలు కూడా కావాలని యిప్పుడు చంపుతామంటున్నారు. ఏమిటండీ అసలు ఈఆడవాళ్ళకు తక్కువ? అఁ హఁ అసలీ ఆడవాళ్ళకు ఏం అధికారాలు తక్కువున్నయటాని...? చెప్పండీ...! భర్త ఎంత పెద్ద అధికారైతే భార్య కూడా ఆ అధికార హోదాలన్ని అనుభవిస్తునే వుందిగా...! అవునంటారా?కాదంటారా? చెప్పండి..." అన్నాడు మా చెల్లెలి భర్త.

పేజి   1 |   2 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved