17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

తిరిగి చిగురిస్తున్న భారత్-ఆఫ్రికా సంబంధాలు

ఈరెండు కారణాలే కాక మరో వ్యూహాత్మక కారణంకూడా కనపడుతోంది. తూర్పు ఆఫ్రికా దేశాలను కొన్నింటిని తమ స్థావరాలుగా చేసుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్న మాఫియా బృందాల ఆట కట్టించడం, కెన్యా వంటి దేశాల సహాయంతో ఉగ్రవాదంపై పోరు, హిందూమహాసముద్ర ప్రాంతంలో భద్రత నెలకొల్పటం వంటి తన వ్యూహాలకు అనుగుణంగా తూర్పు ఆఫ్రికా దేశాలను ఉపయోగించుకోనుంది.

చైనా: ప్రేరణ - పోటీదారు

భారత్ ఆఫ్రికాపై దృష్టి కేంద్రీకరించడానికి చైనా కూడా ఒక ముఖ్య కారణం. ఆర్థికాభివృద్ధిలో ప్రపంచంలో అత్యంత వేగంగా సాగుతున్న చైనాకుకూడా మన దేశం లాగానే ఇంధన వనరుల అవసరం చాలా వుంది. ఈ కారణం చేత చైనా కూడా ఆఫ్రికాపై గురిపెట్టింది. ఇప్పటికే తన నేతలను, అధికారులను ఆఫ్రికా దేశాలకు పంపుతూ 2006 లో శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించింది. సుమారు రూ. 10, 800 కోట్లు (2.7 బిలియన్ డాలర్లు) నిధులను ఆఫ్రికాలోకి పోసింది.

అయితే ఆఫ్రికా పట్ల భారతదేశం అనుసరిస్తున్న విధానం, దృక్పథం కచ్చితంగా ఇతరదేశాల పద్ధతులకంటే భిన్నమైనవని మన విదేశాంగశాఖ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

చైనా తమ దేశ కార్మికులను ఆఫ్రికా దేశాలకు పంపి వలస పద్ధతిని అనుసరిస్తుండగా, అందుకు భిన్నంగా భారత్ ఆఫ్రికాలో మానవ వనరులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కార్యక్రమాలలో సహాయంచేయడం ద్వారా పరస్పర అభివృద్ధి సాధించండం వ్యూహంగా ముందుకువెళుతోంది.

సాంకేతిక రంగంలో పరస్పర సహకారం, విద్య, మానవవనరుల రంగాలలో సహాయంలో భాగంగా ఆఫ్రికా వృత్తి నిపుణులకు మరిన్ని ఉపకారవేతనాలను, శిక్షణ అవకాశాలను కూడా భారత్ అందిస్తోంది. భారీ అభివృద్ధి ప్రాజక్టులలో పాలుపంచుకుంటోంది. తద్వారా ఆఫ్రికా పాలకుల, ప్రజల మనసులను దోచుకోవడానికి ప్రయత్నిస్తోంది. విశాల ఆఫ్రికా ఇ-నెట్‌వర్క్ ప్రాజెక్ట్ ద్వారా ఆరోగ్య రంగంలో సహకారానికి అనేక అవకాశాలు తలెత్తుతాయి. ఈ ప్రాజెక్టు 5 బిలియన్ డాలర్ల, అంటే రూ.20, 000 కోట్లు అంచనా వ్యయంతో చేపడుతున్నారు. వ్యవసాయరంగం, చిన్న- మధ్య తరహా పరిశ్రమలు, జల వనరుల వినియోగం, బయోటెక్నాలజీ, పర్యావరణ మార్పులు వంటి రంగాలలో కూడా పరస్పర సహకారానికిగల అవకాశాలను భారత్-ఆఫ్రికా దేశాలు పరిశీలిస్తున్నాయి. ఉగ్రవాదం, ఐక్యరాజ్య సమితి సంస్కరణల విషయంలో కూడా భరత్-ఆఫ్రికా సంబంధాలు ప్రాముఖ్యం కానున్నయి.

ప్రపంచంలో చాలా దేశాలు ఆఫ్రికా దేశాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూండంతో ఇప్పుడు భారత్‌కు పోటీ చాలా పెరిగింది. పటిష్టమైన వ్యూహంతో, ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ దౌత్య సంబంధాలను పటిష్టపరిచి విస్తరింపచేయవలసిన సమయం ఆసన్నమైంది.

పేజి   12 |      

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved