17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

తిరిగి చిగురిస్తున్న భారత్-ఆఫ్రికా సంబంధాలు

చీకటి ఖండంగా పేరుపడిన ఆఫ్రికా ఇప్పుడు అన్ని ప్రముఖ దేశాల విదేశీ విధానాలలో ఒక ముఖ్య స్థానాన్ని సంతరించుకోటోంది. చారిత్రికంగా భారత్‌కు ఆఫ్రికాతో మంచి సంబంధాలు వున్నాయి. జాతివివక్షకు వ్యతిరేకంగా ఆఫ్రికా విమోచనం కోసం అలీనోద్యమం, కామన్‌వెల్త్ వేదికలమీద భారత్ తన గళాన్ని సమర్ధవంతంగా వినిపించింది. ప్రపంచ స్థాయిలో ఈ వుద్యమాలకు నాయకత్వాన్ని అందించింది. తరువతి కాలంలో భరత దౌత్య విధానంలో వచ్చిన మార్పులు, ఆచరణాత్మకతకు పెరిగిన ప్రాముఖ్యంతో భారత ఆఫ్రికా సంబంధాలు కాస్త కుంటుపడ్డాయి. ఒక దశాబ్దకాలపు విరామం తరువాత మళ్ళీ ఈ ఇరువర్గాల మధ్య సంబంధాలను పునరుజ్జీవింపచేసి బలోపేతం చేయడానికి భారత్ తన ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ సంవత్సరం ఏప్రిల్ 8-9 తేదీలలో దేశ రాజధాని న్యూఢిల్లీ లో భారత్-ఆఫ్రికా సిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. ఆఫ్రికా ఖండంలోని 14 దేశాల అధినేతలు "ఆఫ్రికన్ యూనియన్" తరఫు ప్రతినిధులుగా ఈ సభకు హాజరయ్యారు.

ఆఫ్రికా ఖండ దేశాలు భారత్‌కు సహజ భాగస్వాములు. వివిధ ఆఫ్రికా దేశాలతో మనకు సామాజికపరమైన సంబంధాలు వున్నాయి. ఆఫ్రికాలో సుమారు 2.8మిలియన్ల ప్రవాస భారతీయులు వున్నారు. సూడాన్, నైజీరియా, ఐవరీ కోస్ట్, ఈజిప్ట్ దేశాలలో ఇప్పటికే భారత కంపనీలు తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నాయి. భారత వుత్పత్తులకు ఆఫ్రికా ఖండం అతి పెద్ద మార్కెట్‌ను కల్పిస్తోంది. ప్రస్తుత వాణిజ్యాభివృద్ధి 25 బిలియన్ డాలర్లు ఉన్నట్లు అంచన.

ఆఫ్రికాపై వేసిన సీతకన్నును మాని సంబంధాలను పెంచుకునే ప్రయత్నాలకు మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో మొదటిది, భారత్ తన భవిష్యత్ ఇంధన అవసరాలు తీర్చుకోవడానికి ఆఫ్రికా ఒక ముఖ్య కేంద్రం కావడం.

ప్రస్తుతం భారతదేశం వినియోగిస్తున్న చమురు, గ్యాస్ వంటి ఇంధన వనరులలో 70% అస్థిరత్వంలో కొట్టుమిట్టాడుతున్న గల్ఫ్ ప్రాంతంనుంచే వస్తున్నాయి. ప్రత్యామ్నాయ సరఫరా దేశాలను అన్వేషించటం అనివార్యంగా మారింది. ఆఫ్రికా ఖండంలోని చమురు సహజవాయువు నిల్వలు ప్రపంచ డిమాండ్‌లో 12శాతం వరకు తీర్చగలవని అంచనా. అంతేకాకుండా ఆఫ్రికాలోని ముడుచమురులో గంధకం(sulphur content) పాలు తక్కువ. దీనివల్ల ఈ ముడి చమురును శుద్ధి చేయటం తేలికేకాక చైక కూడా.

ఆర్థికాభివృద్ధిపథంలో వేగంగా పయనిస్తున్న భారత్‌కు ఇంధన అవసరాలు గణనీయంగా పెరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఆఫ్రికా చమురుకు ప్రాముఖ్యత చాలా పెరిగింది. నైజీరియావంటి దేశాలలోని ఇంధన నిల్వలతో భారతదేశపు ఇంధన అవసరాలు చాలావరకు తీరగలవు. చమురు, సహజవాయు సంస్థకు చెందిన విదేశీ పెట్టుబడుల విభాగమైన ఓఎన్‌జిసి విదేశ్ లిమిటెడ్(ONGC Videsh Ltd) అప్పర్ నైల్ ఆయిల్ ఫీల్డ్‌లో 720 మిలియన్ డాలర్లు, అంటే రూ. 2880 కోట్లు, పెట్టుబడి పెట్టి, 25% వాటాను సంపాదించింది. అంతేకాక మరో 200 మిలియన్ డాలర్లు, అంటే రూ.800 కోట్లు, పెట్టుబడిని 741 కిలోమీటర్ల పైప్‌లైన్ ప్రాజెక్టులో పెట్టాలని భావిస్తోంది.

పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కీనా ఫాసో, చాద్, ఈక్వటోరియల్ గిని, ఘనా, గినీ-బిసావు, ఐవరీకోస్ట్, మాలే, సెనగల్ దేశాలతో కలసి భారత్ టీమ్-9గా ఏర్పడింది. ఈ 8 దేశాలకు రూ. 2000 కోట్లు ($500 మిలియన్ డాలర్లు)రుణాన్ని భరత్ అందించనుంది. 70 శాతం మన చమురు ఉత్పత్తులు పశ్చిమ ఆఫ్రికాకు చెందిన గల్ఫ్ ఆఫ్ గినీలోనే కేంద్రీకృతమై వున్నాయి. అందువలన ఈ దేశాలతో దౌత్య సంబంధాల ద్వారా తన ప్రయత్నాన్ని సాధించుకోవాలని భారత్ ప్రయత్నిస్తోంది.

భారత్ తన ఆఫ్రికా సంబంధాలపై దృష్టి సారించడానికి మరో కారణం ఈ ఖండంలో ఉన్న యురేనియం నిల్వలు. ఆఫ్రికాలో చాలాదేశాలలో యురేనియం నిల్వలు పుష్కలంగా వున్నాయి. అణు నిల్వల సరఫరా దేశాల బృందం అనుమతి లభించిన తరువాత యురేనియం దిగుమతులకై భారత్ ప్రయత్నించక తప్పదు.

పేజి   1 |   2 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved