17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ఆపదలో ఆపద్భంధువు -108

By కె, మణినాథ్

అర్ధరాత్రి సమయం. సావిత్రమ్మకి కాళ్ళూ చేతులూ ఆడటం లేదు. పరంధామయ్య గుండె నొప్పితో బాధ పడుతున్నాడు. డాక్టరు దగ్గరికి వెళ్ళాలన్నా సరియైన ఫొన్ నెంబరు లేదు. ఏ ఆసుపత్రికి తీసుకు వెళ్ళాలో తెలీదు. సాయం చెయ్యాటానికి ఎవరూ లేరు.... సరియైన వాహనాలు లేవు... ఏమి చేయాలి అని ఆలోచించింది.... అప్పుడు గుర్తు వచ్చింది. .... ఇటీవల బహుళ ప్రచారంలో వున్న అంబులెన్స్ నెంబరు 108 అని, పిలిచిన వెంటనే వస్తారనిని..... ఇక ఆలస్యం చేయకుండా108 కి ఫోన్ చేసింది. .... కాల్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు ..... ఇరవై నిమిషాల్లో ఇంటికి వచ్చిన వాహనంలో ఆసుపత్రికి తరలించారు పరంధామయ్యని. తక్షణమే వైద్యులు అందించిన సేవలతో త్వరగా కోలుకున్నాడు పరంధామయ్య. అంతవరకు ఆందోళనతో వున్న సావిత్రమ్మ సమయానికి సహాయం అందించిన 108 సిబ్బందికి ఆనందంతో తన కృత ఙ్ఞతలు తెలుపుకుంది.

౦ ౦ ౦

తమ పెళ్ళి రోజుని ఆనందంగా జరుపుకోవాలని ముందుగా ప్లాన్ వేసుకున్నారు రాధ మనోహర్ లు. తిరుపతి వెళ్ళి, అటునించి మద్రాస్, ఊటి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కారులో బయలు దేరారు. నేషనల్ హైవే పై కారు వెళుతూంది. కబుర్లు చెప్పుకుంటూ వెళుతున్న వారి కారుని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొంది. అంతే కారు నుజ్జు నుజ్జు అయింది. కొన వూపిరితో వున్న రాధా మనోహర్ లని చూసి భయపడి లారీ డ్రైవర్ పారిపోయాడు.

నిముషాల్లో జనం చుట్టుముట్టారు. అందరికీ కిందపడి వున్న వాళ్ళిద్దరికి సాయం చేయాలనే వుంది. కాని జరిగింది ఆక్సిడెంట్. పోలీసులు, కేసులు గొడవ... ఏవరు ముందుకి రావటం లేదు. ఇంతలో అక్కడ జరిగింది చూస్తూన్న ఓ విద్యార్ధి తన మొబైల్ నుంచి 108 కి ఫోన్ చేశాడు. జరిగిన స్థలం, గాయపడిన వారి పరిస్థితి ఎలావుందో అన్ని వివరంగా చెప్పాడు. ఫోన్ అందుకున్న 108 వాహనం పదినిముషాల్లో అక్కడికి చేరుకుంది. హుటా హుటిన వారిని దగ్గరిలోని ఆసుపత్రికి తీసుకెళ్ళారు వాహనంలోని సిబ్బంది. సకాలం లో వారికి వైద్య సేవలు అందటం వల్ల రాధ మనోహర్‌ల జంట ఈనాడు మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించగలిగారు.

౦౦౦

2005 లో ప్రారంభం

ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజలకి అందుబాటులో వుంటూ, ఆత్యవసర సేవల నందిస్తున్న 108 వాహన సర్వీసులు చాల విస్తృత పరిధిలో పని చేస్తున్నాయి. మన రాష్ట్రంలోని 23 జిల్లాల్లో 50 ప్రాంతాల్లో అత్యవసర సేవల వాహనాలు పనిచేస్తున్నాయి. ఉదాహరణకి ఒక్క ప్రకాశం జిల్లాలోనే 19 అంబులెన్స్ లు పనిచెస్తున్నాయి. ఈ 108 సేవలని నగరం లో రాష్ట్ర ముఖ్య మంత్రి డాక్టర్ శ్రీ వై.యస్. రాజశేఖర రెడ్డి ఆగష్టు 15, 2005న ప్రారంభించారు. ప్రధానంగా ఆపదలో వున్న వారికి వైద్య సహాయం అందించే "108 సేవలు" రాజధానిలోనే కాక రాష్ట్రంలోని ఇతర ప్రాతాంలలో కూడా ఇప్పుడు అందుబాటులో వున్నాయి.మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం చేతుల మీదుగా భీమవరం, అమలాపురం లలో జనవరి 9, 2006న "108" ప్రారంభమైయ్యింది.

గ్రామీణ ప్రజలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, ప్రమాదాలు జరిగినపుడు, ఇలా ఆపదలో ఉన్న ఎవరినైనా 108 సర్వీసు వాహనాలు వారిని ఆసుపత్రికి తరలిస్తుంటాయి.ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వాహనాలలో స్ట్రెచెర్, వీల్ ఛైర్, అత్యవసర మందులు,ఆక్సిజన్, గ్లూకోజ్ వంటి ఫ్లూయిడ్స్(ద్రవాలు), అందుబాటులో వుంటాయి. ప్రతి అంబులెన్స్ లో ఒక డాక్టరు, ట్రైనింగ్ పొందిన ఇద్దరు నర్సులు, ఒక లాబ్ టెక్నీషియన్ వుంటారు.

ప్రభుత్వం-సత్యం కంప్యూటర్స్ భాగస్వామ్యంలో

ప్రముఖ టెక్నాలజీ సంస్థ అయిన సత్యం కంప్యూటర్ అధినేతలు బి. రామ లింగ రాజు, రామ రాజు సోదరులు "ఈ ఎమర్జన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (EMRI)" సంస్థ ద్వారా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీస్ (ERS) ని నగరంలో ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ లోమెడికల్, ఫైర్ సర్వీస్ మరియు పోలీసు ఎమర్జన్సీ విభాగాలు కలసి వుంటాయి. సత్యం సోదరులు తమ సొంత నిధులనించి 34 కోట్ల నిధులు అందించటమే కాక, హైద్రాబాదు ముఖ్య కేంద్రంగా ఈ బృహత్ ప్రణాళికకి 35 ఎకరాల భూమిని కూడ దానం చేశారు.ఈ ఎమర్జన్సీ సర్వీసుల కింద అయ్యే ఖర్చులలో 95% ప్రభుత్వం, 5% సత్యం కంప్యూటర్స్ భరిస్తున్నాయి.

పేజి   1 |   2 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved