22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

పంచ మహాకావ్యములు

రెండువేల ఏళ్ళుగా మనజాతి పేరు ప్రతిష్టలు గడించింది.ఒకజాతి గొప్పజాతి అంటే తక్కిన లక్షణాలతో పాటు ఆభాషలో గొప్పకావ్యాలు కూడా ఉంటాయి.తెలుగు జాతికి కూడా ఉన్నాయి.

మనకు సంస్కృత భాష మాతృభాషవంటిది. అన్ని భాషలూ ఇందులోంచి పుట్టాయంటారు. సంస్కృత భాష చక్కగా తెలియాలంటే "పంచ కావ్యాము" లున్నాయి. అవి :

 1. రఘువంశము
 2. కుమారసంభవము
 3. మేఘసందేశము.
 4. మొదటి మూడు కాళిదాసు రచనలు .
 5. కిరాతార్జునీయము - ఇది భారవి రాసినది
 6. శిశుపపాలవధము.ఇది మాఘుడు రాసినది.
(కొన్ని ప్రాంతములలో కాళిదాస విరచిత మేఘసందేశము స్థానంలో శ్రీహర్షుని నైషదీయ చరితముని గణించారు. మరికొన్ని ప్రాంతములలో, పంచ మహాకావ్యములకి దీనిని జోడించి షట్కావ్య పఠనం జరిగింది.)

కొన్నివేల ఏళ్ళు తరువాత, సంస్కృతభాష కున్నంత మర్యాద మన తెలుగు భాషకూ వచ్చింది.మన తెలుగుభాష బాగా నేర్చుకోవాలంటే మనకి కూడా పంచమహా కావ్యాలున్నాయి. అవి :

 1. అల్లసాని పెద్దనామాత్యుడు రాసిన "మను చరిత్రము"
 2. రామరాజభూషణడు రాసిన "వసు చరిత్రము"
 3. శ్రీ కృష్ణదేవరాయలవారే రాసిన "ఆముక్తమాల్యద"
 4. తెనాలి రామకృష్ణకవి రాసిన "పాండురంగ మహత్యము"
 5. శ్రీనాథుడు రాసిన "శృంగార నైషధము".
(కొందరు ఇందులో పింగళి సూరన రచించిన "రాఘవ పాండవీయము"ను తెనాలి రామకృష్ణుని రచన స్థానములో పేర్కొంటారు.)

పై నాలుగు స్వతంత్ర రచనలు. ఐదవది, నైషధము, మాత్రం అనువాదము. సంస్కృతములో, పైన తెలిపినట్లు, శ్రీ హర్షుడు అనే గొప్పకవి "నైషధము" అన్న గొప్పకావ్యమురాశారు.శృంగార నైషధము దానికి తెలుగని చెప్పవచ్చును.

ఈనాడు కొత్తగా సాహిత్యక్షేత్రంలో అడుగుపెట్టే యువతీయువకులకిగానీ, తెలుగు నేర్చుకుందామన్న భాషాభిమానులకుగానీ, కొత్తతరం సాహిత్యపిపాసులకిగానీ ప్రాచీన సాహిత్యం వైపు చూపే మార్గదర్శిలేరు. అందువల్ల ఆ కావ్యాల్లో ఎమున్నాయో, వాటి సాహిత్య గొప్పదనం ఏమిటో కూడా మనకు తెలియదు.

సాహిత్య అభివ్యక్తి పరిశీలనకే కాకుండా, ఆనాటి సాంఘిక-సాంస్కృతిక పరిణామాల్ని ప్రతిబింబించటలోనూ ప్రాచీన తెలుగు సాహిత్యం ఎంతో చలనశీలంగా, సంస్పందనశీలంగా సజీవమతంగా గోచరిస్తుంది.

దేహాన్ని నిరాకరించిన ధర్మాలు ఒకవైపూ, దేహామే ఆలంబనగా వికసించిన వివిధ జీవితవృత్తులు మరొకవైపూ ఆనాటి ప్రజానీకాన్ని సంక్షుభితమొనర్చాయి.కావ్యాలకు ప్రాతిపదిక ధర్మమా, దైవమా,దేహమా అన్న మీమాంసని ప్రతి ఒక్క కవి తనకై తాను, తనకోసంతాను సమన్వయించుకునేందుకు చాలా సంగ్రామమే చేశాడు.

సాహిత్యకౌశలంలో, వస్తువివేచనలో, అభివ్యక్తి గాఢతలో ప్రపంచ సాహిత్యంలొ నిలబడగలిగినది మన ప్రాచీన తెలుగు సాహిత్యం.

ఆ కావ్యాలను కథలుగా తెలుసుకొని, సాహిత్యంలో ఉన్న విశేషాలను అర్థం చేసుకున్న తరువాత మనకు కావ్యాలను చదవాలన్న ఉత్సాహం కలుగుతుంది. ఇది ఏ విషయానికైనా వర్తిస్తుంది.

మన కావ్యాలను పరిచయం చేసే ప్రయత్నంగా అపా (apa) త్వరలో మనుచరిత్రను ప్రచురించనుంది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved