22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

బైసని వారి పల్లె: సౌరశక్తితో ప్రగతి పథం

By , ఛత్రపతి

దేశ ప్రగతికి పల్లెలే పట్టుకొమ్మలు. ఇప్పుడు సాంప్రదేయేతర ఇంధన వనరుల వినియోగంలో కూడా దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోంది ఈ పల్లే. ప్రగతిలో ముందుంనామనుకొనే పట్టణ వాసులు ఈ గ్రామస్తులను చూసి నేర్చుకోవాల్సిసది చాలా వుందనిపిస్తోంది

భారత్, చైనా లాంటి అభివృద్ధి పథంలోని దేశాలలో ఇంధనావసరాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. చమురు, సహజవాయువులపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వినియోగం తరుగుతున్న నిల్వలు దృష్ట్యా సాంప్రదాయేతర ఇంధనాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

ఈ నేపధ్యంలో దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచారు బైసనివారిపల్లె వాసులు. చిత్తూరులోని యీ గ్రామస్తులు ఎనభై దశకంలోనే సహజ వనరులు, సాంప్రదాయేతర ఇంధన వనరుల వాడకానికి నాంది పలికారు. బయోగాస్ ప్లాంటులను ప్రారంభించటం ద్వారా వారు వంట చెరకు వాడకాన్ని తగ్గించగలిగారు. ఎనిమిది (8) ప్లాంట్లతో మొదలై యీ నాటికి అవి 23కి చేరాయి. తద్వారా వీరు సాలీన సుమారు 72 టన్నుల వంట చెరకు వాడకాన్ని తగ్గించారు. కట్టెలు కాలడం వల్ల విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ (Carbon Dioxide బొగ్గు పులుసువాయువు) వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఈ గ్రామస్తులు సంవత్సరానికి 104 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ వాయువు విడుదలను తగ్గించగలిగారు.

ఇప్పుడు వీరి కీర్తికిరీటాలలో మరొక పింఛాన్ని కూడా జోడించుకున్నారు. దేశంలోనే ప్రప్రధమంగా సౌరశక్తితో నడిచే గ్రామంగా వీరు ఆవిర్భవించారు. ఆస్ర్టేలియాకు చెందిన "ఇంటర్ సాల్" అనే ఎన్.జీ.ఓ. వారి సాయంతో ఎస్.కె. తరహా సోలార్ కుక్కర్లను వీరికి గధియా సోలార్ అనే పర్యావరణ అభివృద్ధి సంఘం వారు గ్రామంలో అమర్చారు.

పట్టు పురుగుల పెంపకం ముఖ్య జీవనోపాధిగా వున్న యీ గ్రామంలో యిప్పుడు యీ కుక్కర్ల సయాంతో చిప్స్, స్వీట్స్, భుజియా వంటి తిండి పదార్ధాల తయారి కూడా మొదలు పెట్టారు.

దేశ జనావళి అందరికి మార్గదర్శకమైన వీరి ప్రయత్నాలు అందరూ అభినందించదగినవి.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved