17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యము

ప్రదేశం - విస్తీర్ణం: పశ్చిమగోదావరి జిల్లా 675 చ.కి.మీ.లు

వృక్ష, జంతు సంపద: ఇది పల్లపు ప్రాంతపు మంచినీటి సరస్సు. ఇక్కడ బురద నేల ఎక్కువ. అందుచేత, రకరకాలైన నీటి పక్షులు ఇక్కడ చేరతాయి. అందులో నీటిబాతులు, అడవి బాతులు, పరజలు, స్పాట్ బిల్సు, బ్రాహ్మణ బాతులు, ఓపెన్ బిల్ కొంగలు, నారాయణ పక్షులు, గూడ కొంగలు, అపుడపుడు సముద్రపు చిలకలు ఇక్కడ చేరుతూ ఉంటాయి. ఇది విహంగ స్వర్గం.

ప్రవేశించు మార్గం: విజయవాడ రైల్వేస్టేషన్ నుండి 60 కి.మీ. రోడ్డు ప్రయాణం (ద.మ.రైల్వే)

వసతి సౌకర్యం: విజయవాడ, ఏలూరులలో అటవీ విశ్రాంతి గృహాలు.

సందర్శించు కాలం: అక్టోబర్ నుండి మే వరకు

వివరాలకు ఏలూరు డివిజనల్ అటవీ అధికారి (అటవీ పర్యవేక్షణ)ని సంప్రదించండి.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved