17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణి అభయారణ్యము

ప్రదేశం/ విస్తీర్ణం: కర్నూలు, ప్రకాశం జిల్లాలు 1194 చ.కి.మీ.లు

వృక్ష, జంతు సంపద: ఇది మిశ్రమ వృక్ష సంపద గల అడవులు గల ప్రాంతం. టేకు, ఏగిస, మద్ది, చిరుమాను, జిట్రేగి, తపసి అందుగ మరియు వెదురు రకాలకు చెందిన వృక్షాలు ఈ అడవులలోనే ఉన్నాయి. ఇక్కడ కనిపించే జంతువులు పులి, చిరుత, ఎలుగుబంటి, రేచుకుక్క, దుమ్ములగొండి, అడవిపిల్లి, కొండముచ్చు, బోనెట్ కోతి, వంగోలిన్, ఉడుము, కడితి, దుప్పి, కొండగెర్రె, బుర్ర జింక, కొండచిలువ, మొసళ్ళు.

నల్లమల కొండల ప్రాంతపు వాయివ్య దిశగా ఈ ప్రాంతం ఉన్నది. గుండ్లకమ్మ అనే ఒక చిన్న నది ఈ ప్రాంతమంతా మెలికలు తిరిగి ప్రవహిస్తున్నది.

ప్రవేశించు మార్గం:

  • కర్నూలు రైల్వేస్టేషన్ నుండి 100 కి.మీ. లేక నంద్యాల రైల్వేస్టేషన్ నుండి 30 .కి.మీ.

వసతి సౌకర్యం: నంద్యాలలోని ఇనస్పెక్షను బంగ్లా దిగువ మెట్ట అటవీ విశ్రాంతి గృహం.

సందర్శించు కాలం: అక్టోబర్ నుండి మే వరకు.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved