19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

ఆంధ్రప్రదేశ్ లోని వన్యప్రాణి అభయారణ్యాలు మరియు జాతీయ పార్కులు

భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఐదవ పెద్ద రాష్ట్రం. ఇక్కడ 1000 కి.మీ.ల వరకు విస్తరించిన అతి పెద్ద తీరప్రాంతం వుంది. కృష్ణా, గోదావరి వంటి రెండు పెద్ద నదులు వున్న రాష్ట్రం ఇదొక్కటే. ఆంధ్రప్రదేశ్ లో విస్తృతమైన, వైవిద్యమైన సుసంపన్నమైన వృక్ష, జంతు సంపద గోచరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా భారత ఉపఖండం మధ్య ప్రాంతంలో నెలకొని వున్నందువల్ల ఇక్కడ అద్భుతమైన భారతదేశపు వృక్ష, జంతుజాతులు వున్నాయి. తూర్పు కనుమలు, నల్లమల కొండల నుండి బంగాళాఖాతం తీరాల వరుకు గల వివిధ స్థలాకృతులు వైవిధ్యమైన జీవావరణానికి దోహదం చేస్తాయి. ఇవి వైవిధ్యమైన వృక్ష, జంతు జాలానికి ఆలంబన అవుతాయి. రాష్ట్రాన్ని స్థూలంగా నాలుగు ప్రధాన వృక్ష జంతుజాలం గల ప్రాంతాలుగా విభజించవచ్చు.

దక్కన్ పీఠభూమి 53%
మధ్యపీఠభూమి 35%
తూర్పు కనుమలు 11%
తూర్పు కోస్తా మండలం 1%

రాష్ట్రం అధికంగా కనిపించే వృక్షాల ఎండాకాలంలో ఆకులు రాల్చే గుణమున్న రకానికి చెందినవి. వీటిలో టేకు, నల్లమద్ది, అందుగు, జీట్రేగి, రక్తచందనం, చిరుమాను మున్నగు వృక్షజాతులు మిళితమై వున్నాయి.

ముఖ్యంగా తూర్పు కనుమలలో వైవిధ్యమైన వృక్షజంతుజాలం విశేషంగా కనిపించడమే కాకుండా, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై కన్పించు కొన్ని మొక్కలకు, పక్షులకు, అల్పజంతువులకు ఆవాస కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. వైవిధ్యత కల్గిన అనేక నివాస స్థావరాలు వివిధ రకాల జంతుజాలాలకు ఆశ్రయమిస్తున్నాయి.

పెద్దపులి, చిరుత, తోడేలు, ఎలుగుబంటి అడవిదున్న, దుమ్ములగొండి, రేచుకుక్క, బుర్రజింక, కొండగొర్రె, మనుబోతు, కడితి, కృష్ణజింక, దుప్పి మున్నగు అనేక జంతుజాతులకు వివిధ రకాల పక్షులు సరీసృపాలకు ఆంధ్రప్రదేశ్లోని అడవులు ఆవాసాన్ని కల్పిస్తున్నాయి. పొడవాటి సముద్రతీరం సముద్రపు తాబేళ్ళ గూళ్ళు నిర్మించుకోవటానికి అనువుగా ఉండటమే కాక, వందలాది రకాల జల చరాల మనుగడకు, ప్రతిసంవత్సరం వలస వచ్చే సముద్రపు చిలక, గూడబాతు మున్నగు వివిధ జాతులకు చెందిన వేలాది పక్షుల ఆహార సముపార్జనకు, ప్రత్యుపత్తికి మరియు ఆవాసానికి తగిన స్థావరాలుగా భాసిల్లుతున్నాయి. అలాగే గోదావరి, కృష్ణానది ముఖద్వారాల వద్ద దట్టమైన మడజాతి వృక్షాలకు చెందిన అడవులు విస్తారంగా ఉన్నాయి.ఇంకా

వన్యప్రాణి సంరక్షణ-అభయారణ్యాలు - జాతీయ పార్కులు

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved