19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

సుందోపసుందులు

By ప్రయాగ, రామకృష్ణ

హిరణ్యకశిపు ని వంశంలో నికుంభు డనే రాజుగారికి ఇద్దరు పిల్లలు కలిగారు. వారే సుందోపసుందులు , అల్లరిలో ఒకరికొకరు తీసిపోరు. రాజుగారి పిల్లలవటం చేత మరీ గారాబంగా పెరిగారు. వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా వుండేవాళ్ళంటే ఏ క్షణంలోనూ, ఏ విషయంలోనూ వారు ఒకరినొకరు విడిచి వుండేవారు కాదు.

వారికి చిన్నప్పుడే ప్రపంచమంతా జయించాలన్న కోరిక కలిగింది. కానీ అది కుదరదే! త్రిలోకాల్లో దేవతలు, మునులు, చక్రవర్తులు, యోధులు ఎందరో వుంటారు. వాళ్ళందర్నీ ఓడించటానికి కేవలం భుజబలం వుంటే సరిపోదు. దైవబలం కూడా వుండాలి. అందుకని నార వస్త్రాలు కట్టి జటాజూటాలతో వింధ్యపర్వతం మీద తపస్సు చేశారు.

తలను నేలకు ఆన్చి, చేతులు గాలిలో నిలిపి అతి కఠోరంగా తపస్సు చేశారు. ఆ తపస్సు నుంచి పుట్టిన వేడికి దేవతలు భయపడ్డారు. ఎన్నో విఘ్నాలు కలిగించారు. ఎన్నో విధాల నచ్చ చెప్పారు. అయినా సుందోపసుందులు చలించలేదు.

ప్రకృతే వారి తపోదీక్షకు స్తంభించిపోయింది.

వింధ్యపర్వతాలు కదిలాయి.

లోకాలన్నీ ఉక్కిరి బిక్కిరయ్యాయి.

దేవతలు అల్లాల్లాడారు. వాళ్ళంతా బ్రహ్మ వద్దకు పరుగెత్తి, "మహానుభావా! రక్షించండి. సుందోపసుందుల తపస్సును ఆపి పుణ్యం కట్టుకోండి" అని ప్రార్ధించారు. వెంటనే విరించి సుందోపసుందుల ఎదుట ప్రత్యక్షమై "నాయనా! మీ తపస్సుకు మెచ్చాను. మీ కోరికలేమిటో చెప్పండి" అని అడిగాడు.

సాష్ఠాంగపడ్డారు ఇద్దరూ.

"స్వామీ! ఎక్కడికి కావాలంటే అక్కడికి ఏ క్షణాన్నయినా వెళ్ళగలిగే కామగమన విద్యనూ, ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపం పొందగలిగే కామరూప విద్యనూ, వాటికి తోడుగా సకల మాయా ప్రదర్శన శక్తినీ అనుగ్రహించండి. ఎవరివల్లా మాకు చావు లేకుండా అమరత్వాన్ని కూడా ప్రసాదించండి" అని వేడుకున్నారు.

"ఏమిటీ అమరత్వమా- అబ్బే! అది కుదరదు. అయితే ఎవరి వల్లా మీకు చావురాదు. మీ వల్ల మీరే మరిణిస్తారు. ఇక తపస్సు ఆపి ఇళ్ళకు వెళ్ళండి" అన్నాడు బ్రహ్మ.

"మా చేతిలో మేము చావటమా- అది జరిగే పని కాదు" అనుకుని వారు సంతోషంతో దండయాత్రలు ప్రారంభించారు. మునుపే రాజుగారి పిల్లలవటం చేత వచ్చిన అతిశయం, ఇప్పుడు కొత్తగా తోడైన బ్రహ్మదేవుని వరాలు - ఇక అడ్డా ఆపా? తోక తెగిన కోతుల్లా లోకంమీద పడ్డారు.

ప్రజలు, రాజులు, బ్రహ్మర్షులు వారి ధాటికి తట్టుకోలేకపోయారు. జపతపాలు ఆగిపోయాయి. యజ్ఞయాగాలు నిలిచిపోయాయి. మున్యాశ్రమాల మీదకి మదుపుటేనుగుల్లా, తోడేళ్ళలా, సింహాల్లా కామరూపాలలో విరుచుకుపడేవారు. ప్రపంచమే సుందోపసుందుల ఆగడాలకు అల్లకల్లోలమైంది.

పేజి   1 |   2 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved