17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

భారత కథ

కాని, దుర్మార్గుల ఆశకు అంతం వుంటుందా?

ఏదో ఒక మిషతో పాండవుల్ని తమ రాజ్యానికి పిలిపించి అంతం చేయాలనుకున్నాడు దుర్యోధనుడు. ఆ రోజుల్లో రాజులు జూదమాడేవారు. "అత్యంత శోభాయమానంగా జూదగృహాన్ని నిర్మించాం. మీరు మా దేశం వచ్చి మా అతిథ్యం స్వీకరించి సరదాగా మాతో పాచికలాడి వెళుదురుగాని రండి" అని దుర్యోధనుడు పాండవులకు కబురు చేశాడు.

రాననటం రాచరికానికి తలవంపులు . ధర్మరాజు వెంటనే బయల్దేరి వెళ్ళాడు.

కౌరవులూ, పాండవులూ జూదంలోకి దిగారు. ఆ జూదంలో కౌరవుల పక్షాన శకుని పాచికలు ఆడాడు. శకుని పాచికలు వెయ్యటంలో దిట్ట. నక్కజిత్తులతో ధర్మరాజుని ఓడించాడు.

ఫలితంగా పాండవులు రాజ్యాన్ని, సకల భోగభాగ్యాల్ని వదులుకుని పన్నెండేళ్ళు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. అరణ్యవాసం చేసి వచ్చిన తరువాత కూడా వారి రాజ్యం వారికి ఇవ్వడానికి దుర్యోధనుడు ఒప్పుకోలేదు.

ఆ కారణాన కౌరవులకీ పాండవులకి మధ్య యుద్ధం జరిగింది.

ఆ యుద్ధంలో పాండవులు కౌరవుల్ని చంపి రాజ్యం చేజిక్కించుకున్నారు. క్లుప్తంగా ఇదీ అన్నదమ్ముల కథ.

అయితే ఈ కథతోపాటు భారతంలో మనకు పనికొచ్చే ఉపకథలు ఎన్నో ఉన్నాయి.

మహాభారతం మహాసముద్రం లాంటిది. అందులో ముత్యాలు ఉన్నాయి. రత్నాలు ఉన్నాయి. అవే భారతంలో చిన్న కథలు .

పేజి   12 |      

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved