19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

భారత కథ

By ప్రయాగ, రామకృష్ణ

ఒకప్పుడు శంతన మహారాజు హస్తినాపురాన్ని పరిపాలిస్తుండేవాడు. మంచి పరిపాలకుడని పేరు పొందాడు. ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలు పొందారు. ఆయన తరువాత ఆయన కుమారులు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు రాజ్యం ఏలారు. వీరిలో విచిత్ర వీర్యుడికి ఇద్దరు కొడుకులు- ధృతరాష్ట్రుడు, పాండురాజు.

ధృతరాష్ట్రుడు గుడ్డివాడు . అందుకని చిన్నవాడైన పాండురాజుకి పట్టాభిషేకం చేశారు. పాండురాజుకి ఇద్దరు భార్యలు. కుంతి, మాద్రి . కుంతికి ముగ్గురు, మాద్రికి ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళే పంచపాండవులు .

పాండురాజు రాజ్యపాలన చేస్తున్నప్పుడు ఒకనాడు వేటకు వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ ఒక ఋషి ఆయన భార్యా జింకలరూపంలో స్వేచ్ఛగా విహరిస్తున్నారు. అవి మామూలు జింకలే అనుకున్నాడు పాండురాజు. మగజింకను బాణం వేసి కొట్టాడు. అది ప్రాణాలు విడుస్తూ "దుర్మార్గుడా! నేను నా భార్యతో ఆనందంగా ఉన్నప్పుడు నన్ను బాణంతో కొట్టి నాప్రాణాలు తీశావు గనుక నీవు కూడా నీ భార్యను కలిసిన తక్షణం చనిపోతావు " అని పాండురాజును శపించింది. దాంతో ఆయన కుంగిపోయి భార్యలిద్దర్నీ వెంటబెట్టుకుని అడవులకు వెళ్ళాడు. పుత్రసంతానం లేకుండా చనిపోకూడదని, మంత్ర మహిమవల్ల పుత్రుల్ని కనవలసిందిగా భార్యల్ని కోరాడు. ఆ కోరిక ప్రకారం కుంతి, మాద్రి దేవతలను వేడుకుని పాండవులను కన్నారు. తరువాత పాండురాజు ఆ అడవుల్లోనే చనిపోయారు.

అందుకని పంచపాండవుల్ని చిన్నప్పుడు అడవుల్లో ఋషులే పెంచారు.

తరువాత కొంచెం పెద్దయ్యాక వాళ్ళ తాతగారైన భీష్మాచార్యులవారికి అప్పగించారు. అక్కడ వాళ్ళు వేద వేదాంగాలు చదువుకున్నారు. అస్త్రవిద్య, శస్త్రవిద్య నేర్చుకున్నారు. అందరిచేత శహభాష్ అనిపించుకున్నారు.

ఇది చూశారు. ఇంకేముంది! ధృతరాష్ట్రుడి కొడుకులకు ఒళ్ళంతా కారం రాసుకున్నట్లయింది.

అల్లరి చిల్లరగా తిరుగుతూ ఆగడాలు చేస్తూ అందర్నీ వేధిస్తూ అందరిచేత ఛీ ఛా అనిపించుకునే వాళ్ళని మన పెద్దవాళ్ళు ధృతరాష్ట్ర సంతతి అంటూంటారు.

అవునా!

ఇంతకీ ధృతరాష్ట్ర సంతతి ఎవరు?

కౌరవులు!

కౌరవులు నూరుగురు.

వాళ్ళల్లో పెద్దవాడు దుర్యోధనుడు. అతను తన చినతండ్రి పిల్లలైన పాండవుల్ని నానా బాధలూ పెట్టాడు. ఇది చూసి భీష్మాచార్యుల వారికి కష్టం కలిగి కౌరవుల్నీ, పాండవుల్నీ పిలిపించి మందలించి ఇద్దరికీ సంధి కుదిర్చారు. అంటే ఇకమీదట మళ్ళీ చీటికిమాటికీ తగవులాడుకోకుండా ఒక ఒప్పందం కుదిర్చారు. ఆ ఒప్పందం ప్రకారం కౌరవులు హస్తినాపురంలోనూ, పాండవులు ఇంద్రప్రస్థంలోనూ ఎవరికి వారు వేరువేరుగా రాజ్యాలు ఏలుకుంటూ వచ్చారు.

పేజి   1 |   2 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved